నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. కృతిశెట్టి, కేథరిన్ కథానాయికలు. ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకుడు. సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మాతలు. శనివారం నితిన్ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ‘‘నా మొదటి ఛార్జ్ తీసుకోవడానికి ఇది సరైన సమయం. సిద్దార్థ రెడ్డిగా బాధ్యతలు తీసుకొన్నా. మీకు నచ్చే, మీరు మెచ్చే మాస్ లుక్‌తో వస్తున్నా’’ అంటూ ఈ సందర్భంగా నితిన్ ట్వీట్ చేశారు. నిజంగానే నితిన్ ఇది వరకు లేని మాస్ అవతార్‌లో దర్శనమిస్తున్నారు. దాడికి సిద్ధమైన.. పోరాట యోధుడిగా ఈ ఫస్ట్‌లుక్‌ని డిజైన్ చేసింది చిత్రబృందం. నితిన్ ఈ చిత్రంలో గుంటూరు జిల్లా కలెక్టర్‌గా కనిపించనున్నారు. ఇదో పొలిటికల్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. ఈ చితాన్రికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. ‘భీష్మ’, ‘మాస్ట్రో’లకు ఆయనే స్వరకర్త. ఆ రెండు చిత్రాల్లో పాటలు ఆకట్టుకొన్నాయి. ఈసారీ హిట్ ఆల్బమ్ వస్తుందని చిత్రబృందం నమ్మకంగా చెబుతోంది.