టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరో నితిన్ (Nithin).. ప్రస్తుతం ‘మాచార్ల నియోజకవర్గం’ (Macharla Niyojakavargam) అనే పొలిటికల్ థ్రిల్లర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొత్త దర్శకుడు రాజశేఖర్ రెడ్డి (Rajasekhar Reddy) తెరకెక్కిస్తున్నాడు. నితిన్ సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ మూవీస్ (Shrestha movies) బ్యానర్‌పై నిర్మాణం జరుపుకుంటోంది. నితిన్ ఐఏయస్ ఆఫీసర్‌గా సరికొత్త గెటప్‌తో అలరించబోతున్న ఈ సినిమాను ఆగస్ట్ 12న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదల చేయబోతున్నారు. ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (Krithi Shetty), కేథరిన్ ట్రెస్సా (Catherin Tressa) కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌ను వినూత్న రీతిలో చేస్తున్నారు. అందులో భాగంగా నితిన్ పాపులర్ సీరియల్స్‌లో కేమియో రోల్స్ చేయబోతున్నట్టు సమాచారం.
సినిమా ప్రమోషన్స్ కోసం స్టార్ హీరోలు పాపులర్ సీరియల్స్‌లో తళుక్కున మెరవడం బాలీవుడ్‌లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఫేమస్ సీరియల్ ‘సిఐడీ’ (CID)లో బాలీవుడ్ స్టార్ హీరోలు కనిపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నితిన్ కూడా ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా త్వరలోనే తెలుగు పాపులర్ సీరియల్స్‌లో కేమియో అపీరెన్స్ ఇవ్వబోతున్నట్టు సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఈ వార్త అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. అయితే నితిన్ ఏ సీరియల్‌లో కనిపిస్తాడు అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.
గతేడాది ‘చెక్ (Check), రంగ్ దే (Rangde)’ చిత్రాలతో వరుసగా పరాజయాలు ఎదుర్కొన్న నితిన్.. ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రంతో మంచి సక్సెస్ అందుకోవాలని పట్టుదలతో ఉన్నాడు. దీనికి తగ్గట్టుగానే అందులో అతడి పాత్ర ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని నిర్మాతలు చెబుతున్నారు. ఇదివరకు విడుదలైన సింగిల్స్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అతి త్వరలో ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నారు. అంజలి (Anjali) స్పెషల్ సాంగ్ ఈ సినిమాకి హైలైట్ కానుందని తెలుస్తోంది. మరి నితిన్ ఏ సీరియల్ లో కనిపిస్తాడో చూడాలి.