Megastar చిత్రంలో నితిన్ ?

ABN , First Publish Date - 2022-06-14T14:56:41+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) గత చిత్రం ‘ఆచార్య’ (Acharya) అభిమానుల్ని తీవ్రంగా నిరాశపరిచింది. ఈ క్రమంలో ఆయన తదుపరి చిత్రాల విషయంలో మరింత జాగ్రత్తగా అడుగులేస్తున్నారు. ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్‌ఫాదర్’ (Godfather), మెహర్ రమేశ్ దర్శకత్వంలో ‘భోళాశంకర్’ (Bolashankar), బాబీ దర్శకత్వంలో ‘వాల్తేరు వీరయ్య’ (waltair Veerayya) (టైటిల్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు) చిత్రాల్లో వరుసగా నటిస్తూ.. అభిమానుల్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారు.

Megastar చిత్రంలో నితిన్ ?

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) గత చిత్రం ‘ఆచార్య’ (Acharya) అభిమానుల్ని తీవ్రంగా నిరాశపరిచింది. ఈ క్రమంలో ఆయన తదుపరి చిత్రాల విషయంలో మరింత జాగ్రత్తగా అడుగులేస్తున్నారు. ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్‌ఫాదర్’ (Godfather), మెహర్ రమేశ్ దర్శకత్వంలో ‘భోళాశంకర్’ (Bolashankar), బాబీ దర్శకత్వంలో ‘వాల్తేరు వీరయ్య’ (waltair Veerayya) (టైటిల్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు)  చిత్రాల్లో వరుసగా నటిస్తూ.. అభిమానుల్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారు. వీటితో పాటు వెంకీ కుడుముల దర్శకత్వంలోనూ ఒక సినిమాను అనౌన్స్ చేశారు చిరు. 


అయితే చిరంజీవి నటిస్తున్న ఈ సినిమాల ప్రత్యేకత ఏంటంటే.. వీటిలో పేరున్న స్టార్స్ నటిస్తున్నారు. ‘గాడ్‌ఫాదర్’ లో సత్యదేవ్ (Satyadev) కీలక పాత్ర పోషిస్తుండగా.. మరో ప్రధాన పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్  (Salman khan)నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే.. ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలో చిరంజీవి తమ్ముడిగా మాస్ మహారాజా రవితేజ (Raviteja) కీలక పాత్ర చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తుండగా.. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇక వీటితో పాటు మెహర్ రమేశ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘భోళాశంకర్’ చిత్రంలో నితిన్ (Nithin) ప్రత్యేక పాత్ర చేయబోతున్నట్టు సమాచారం అందుతోంది. 


‘భోళాశంకర్’ చిత్రంలో చిరంజీవి సరసన మిల్కీ బ్యూటీ తమన్నా (Tamanna) కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే చిరు చెల్లెలిగా మహానటి కీర్తి సురేశ్ (Keerthi Suresh) నటిస్తున్న విషయమూ విదితమే. ఆమెకు జోడీగా నితిన్ నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఆల్రెడీ నితిన్, కీర్తి సురేశ్ ఇంతకు ముందు ‘రంగ్‌దే’ (Rangde) అనే మూవీలో జంటగా నటించారు. అజిత్ (Ajith) నటించిన సూపర్ హిట్ తమిళ చిత్రం ‘వేదాళం’ (Vedalam)కు భోళాశంకర్ అఫీషియల్ రీమేక్. ఇందులో అజిత్ చెల్లెలిగా లక్ష్మీ మీనన్ (Lakshmi Menon) నటించగా.. ఆమెకి జోడీగా అశ్విన్ కాకుమాను (Aswin Kakumanu) నటించాడు. అతడి పాత్రనే ‘భోళాశంకర్’ లో నితిన్ చేస్తున్నట్టు వినికిడి. మరి ఈ వార్తల్లో నిజానిజాలేంటో తెలియాలంటే.. కొద్దిరోజులు ఆగాల్సిందే. 

Updated Date - 2022-06-14T14:56:41+05:30 IST