హరిహర వీరమల్లు: నిధీ అగర్వాల్‌ ఆసక్తికర విషయాలు!

పవన్‌కల్యాణ్‌ హీరోగా క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రం నుంచి ఆసక్తికర అప్‌డేట్‌ వచ్చింది. కరోనా కారణంగా షూటింగ్‌కు కొంత గ్యాప్‌ వచ్చింది. తాజాగా తదుపరి షెడ్యూల్‌ కోసం క్రిష్‌ పవన్‌తో డైలాగ్‌ సిట్టింగ్‌లో కూర్చున సంగతి తెలిసిందే! తాజాగా నిధీ అగర్వాల్‌ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇది రెండు కాలాల మఽధ్య నడిచే కథ అని నిధీ అగర్వాల్‌ బయటపెట్టారు. దీనిని బట్టి పవన్‌కల్యాణ్‌ వీరమల్లుగా ఓ పాత్రతోపాటు మరో పాత్రలోనూ అలరిస్తారని తెలుస్తోంది. ఈ చిత్రం కోసం నిధీ యాక్షన్‌ సన్నివేశాల్లో కూడా నటించారు. వపన్‌తో నటించడం తన అదృష్టమని తెలిపారు. ప్రస్తుతం ఆమె చెప్పిన విషయాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మెగా సూర్య మూవీస్‌ పతాకంపై ఎ..ఎంరత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 


అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.