రహస్యంగా ప్రేమ వ్యవహారం నడిపిన Vicky Kaushal, Katrina Kaif.. పెళ్లికి ముందు ఆ జంట ఇచ్చిన హింట్స్ ఇవిగో..

ABN , First Publish Date - 2022-05-16T19:14:44+05:30 IST

బాలీవుడ్ క్రేజీ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ 2021లో పెళ్లి పీటలు ఎక్కిన విషయం అందరికీ తెలిసిందే. అయితే వారి

రహస్యంగా ప్రేమ వ్యవహారం నడిపిన Vicky Kaushal, Katrina Kaif.. పెళ్లికి ముందు ఆ జంట ఇచ్చిన హింట్స్ ఇవిగో..

బాలీవుడ్ క్రేజీ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ 2021లో పెళ్లి పీటలు ఎక్కిన విషయం అందరికీ తెలిసిందే. అయితే వారి పెళ్లికి ముందు వరకు ఈ జంట ప్రేమలో ఉన్న విషయం బయటికి రాకుండా చాలా జాగ్రత్తపడ్డారు. దీంతో వారి అభిమానులు ఎంతో ఆశ్చర్యపోతూ ఈ కపుల్ తమ ప్రేమ విషయాన్ని ఇంత గోప్యంగా ఎలా ఉంచగలిగారోనని ఆశ్చర్యపోయారు. తాజాగా విక్యాట్ తమ లవ్ గురించి ముందే హింట్ ఇచ్చినట్లు నెట్టింట కొన్ని వార్తలు ప్రచారం అవుతున్నాయి. 


కత్రినా కైఫ్ 2018లో ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా తనకు విక్కీ కౌశల్‌తో పని చేయాలని ఉందని తెలిపింది. అంతేకాకుండా ‘మేమిద్దరం వెండితెర మీద జంటగా బావుండొచ్చు’ అని కత్రిన చెప్పుకొచ్చింది. కరణ్ జోహార్ షోలో క్యాట్ కామెంట్స్ గురించి అడగగా.. ‘నిజంగానా’ అంటూ విక్కీ ఆశ్చర్యంగా రిప్లై ఇచ్చాడు. 


అలాగే.. విక్కీ, కత్రిన కలిసి 2020లో జరిగిన ఇషా అంబానీ, ఆనంద్ పిరమల్‌ ఏర్పాటు చేసిన హోలి (Holi) సెలబ్రేషన్స్‌కి హాజరయ్యారు. అయితే ఈ జంట కలిసి ఉన్నట్లు ఫొటోలు, వీడియోలు బయటికి రాకుండా జాగ్రత్తపడ్డారు. అయితే.. మరోసారి కత్రిన స్నేహితురాలు, నటి ప్రియాంక చోప్రా (Priyanka Chopra), నిక్ జోనాస్ (Nick Jonas) దంపతులతో కలిసి హోలి వేడుకలు చేసుకున్నారు. ఆ సందర్భంలో ప్రియాంక, కత్రినాతో నిక్ సెల్ఫీ వైరల్ అయ్యింది. కానీ.. ఆ ఫొటోతోపాటు నిక్ షేర్ చేసిన వీడియోలో ఈ భామలతో మాట్లాడుతున్న విక్కీ కౌశల్‌ని నెటిజన్లు పసిగట్టేశారు. 


అంతేకాకుండా.. ఓసారి కత్రిన ఓ పిక్‌ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో పసుపు టీ షర్ట్ వేసుకుని ముఖం కనిపించకుండా వ్యక్తిని క్యాట్ కౌగిలించుకొని ఉంది. అయితే.. కొద్ది రోజులకి అలాంటి టీ షర్ట్‌తోనే విక్కీ బయట కనిపించడం విశేషం. వారి పెళ్లి తర్వాత ఈ విషయాలన్నింటి గురించి నెట్టింట చాలా చర్చకు దారి తీశాయి. అంతేకాకుండా వాటిమీద కొందరు అభిమానులు మీమ్స్ కూడా తయారు చేశారు.

Updated Date - 2022-05-16T19:14:44+05:30 IST