తన Item Songని సమర్థించుకునేందుకు... మణిరత్నం పాటని చర్చలోకి లాగిన Hot Beauty!

బాలీవుడ్ బ్యూటీ నియా శర్మ తాజాగా ‘ఫూంక్ లే’ వీడియో సాంగ్‌లో ఆడిపాడింది. అయితే, అటువంటి ఐటెం నెంబర్స్ కారణంగా స్త్రీల గౌరవానికి వచ్చే భంగమేమీ లేదని ఆమె అంటోంది. ‘‘ఒకవేళ ఐటెం సాంగ్స్ అంత చెడ్డవే అయితే... ‘ఛయ్యా ఛయ్యా’ లాంటివి గతంలో చేసుండేవారే కాదు’’ అంది నియా! ‘‘వంద మంది మగవాళ్ల మధ్య పాటలో కనిపించటానికి నేను కూడా మొదట్లో చాలా సందేహించాను’’ అని కూడా బాలీవుడ్ హాటీ చెప్పుకొచ్చింది!

గతంలోనూ పలు సూపర్ హాట్ వీడియో సాంగ్స్‌లో కనిపించిన నియా శర్మ ‘ఫూంక్ లే’ పాటలో ఎప్పటిలాగే వయ్యారాలతో విజృంభించింది. అయితే, అటువంటి పాటలతో మహిళల్ని అవమానిస్తున్నారంటూ కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. వాటిపై స్పందిస్తూ ఆమె మణిరత్నం ‘దిల్‌ సే’ సినిమాను గుర్తు చేసుకుంది. అందులో మలైకా అరోరా మీద పిక్చరైజ్ చేసిన ట్రైన్ సాంగ్ ‘ఛయ్యా ఛయ్యా’ ఇప్పటికీ అనేక మందికి హాట్ ఫేవరెట్. కానీ, అది కూడా సినిమాలో ఐటెం సాంగే! ‘దిల్ సే’లో హీరోయిన్ మనీషా కోయిరాలా కాగా మలైకా కేవలం ఒక్క పాటలో ఆడి, పాడి బోలెడంత ఫాలోయింగ్ సంపాదించుకోగలిగింది!


షారుఖ్ ఖాన్, మలైకా మీద మణిరత్నం లాంటి లెజెండ్రీ డైరెక్టర్ చిత్రీకరించిన క్లాసిక్ సాంగ్‌ని... తన పాట కోసం నియా చర్చలోకి లాగటం కొందరికి నచ్చటం లేదు. ఆమె చేసిన లెటెస్ట్ ఐటెం నెంబర్ ‘ఫూంక్ లే’ ‘ఛయ్యా ఛయ్యా’తో ఏమాత్రం సరితూగదని వారంటున్నారు.  

Bollywoodమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.