బిగ్గెస్ట్ ఓటీటీ ప్రాజెక్టులో అనుష్క శర్మ.. మరో 2 సినిమాల్లోను ..

ABN , First Publish Date - 2021-12-31T23:04:00+05:30 IST

అనుష్క శర్మ అభిమానులకు తీపి కబురు అందింది. ఆమె తిరిగి వెండితెర మీద కనిపించబోతుంది. విరాట్ కోహ్లీని పెళ్లి చేసుకున్న అనంతరం సినిమాలకు

బిగ్గెస్ట్ ఓటీటీ ప్రాజెక్టులో అనుష్క శర్మ.. మరో 2 సినిమాల్లోను ..

అనుష్క శర్మ అభిమానులకు తీపి కబురు అందింది. ఆమె తిరిగి వెండితెర మీద కనిపించబోతుంది. విరాట్ కోహ్లీని పెళ్లి చేసుకున్న అనంతరం సినిమాలకు ఆమె టాటా చెప్పిన సంగతి తెలిసిందే. 2022లో బిగ్గెస్ట్ ఓటీటీ ప్రాజెక్టులో ఆమె నటించబోతున్నట్టు తెలుస్తోంది. మరో 2 చిత్రాల్లోను కనిపించబోతున్నట్టు బీ టౌన్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తంగా 3ప్రాజెక్టుల్లో  నటించబోతున్నట్టు బాలీవుడ్ వర్గాలు తెలుపుతున్నాయి. 


‘‘ 2022లో అనుష్క శర్మ సినిమాల్లో నటించబోతుంది. ఆమె 3 ప్రాజెక్టుల్లో కనిపించే అవకాశం ఉంది. 2 చిత్రాలు, 1 ఓటీటీ ప్రాజెక్టులో నటించనుంది. భారత్‌లో పెద్ద ఓటీటీ ప్లాట్‌ఫాం ఒక ప్రాజెక్టును నిర్మించబోతోంది. డిజిటల్ కంటెంట్‌లోనే ఆ ప్రాజెక్టు అతి పెద్దది. ఈ ఓటీటీ ప్రాజెక్టుకు ఒకే చెప్పడంతో పాటు మొత్తంగా 3ప్రాజెక్టులకు ఆమె సంతకం చేసింది. వచ్చే ఏడాది ప్రారంభంలో 3ప్రాజెక్టులకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. బాలీవుడ్‌కు అనుష్క బిగ్గెస్ట్ హిట్‌లను అందించింది. తన నటనతో అందరిని ఆకట్టుకుంటుంది. మంచి సినిమాల్లో భాగం కావాలని ఆమె ఆశిస్తోంది ’’ అని బాలీవుడ్‌కు చెందిన ఒక వ్యక్తి తెలిపారు. 

Updated Date - 2021-12-31T23:04:00+05:30 IST