తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..
ABN , First Publish Date - 2022-12-06T14:08:55+05:30 IST
నెట్ వినియోగం పెరిగిన ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా విపరీతంగా పెరిగింది. దీంతో థియేటర్లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి..

నెట్ వినియోగం పెరిగిన ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా విపరీతంగా పెరిగింది. దీంతో థియేటర్లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి. అంతేకాకుండా థియేటర్లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. అంతేకాకుండా కొన్ని సినిమాలైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. డిసెంబర్ 5న ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల గురించి తెలుసుకుందాం..
అనంత: ది ఎటర్నల్ (Ananta: The Eternal)
సువో అనే వ్యక్తికి 40 ఏళ్లు. అప్పటికి పెళ్లి కాదు. అయితే మస్తు అనే టీచర్‌తో చాలా క్లోజ్‌గా ఉంటాడు. ఓ రోజు హఠాత్తుగా మస్తు మాయమైపోతుంది. సువో ఆమెను కనుక్కున్నాడా లేద అనేది ఈ చిత్ర కథ. అభినందన్ దత్తా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనింద్య పులక్, బెనర్జీ రిత్విక్ చక్రవర్తి, సోహిని సర్కార్ ప్రధాన పాత్రలో నటించారు.
బ్లాక్ ఆడమ్ (Black Adam)
డీసీ ఎక్స్టెండెడ్ యూనివర్స్ సిరీస్‌లో వచ్చిన మరో అమెరికన్ సూపర్ హీరో చిత్రం ‘బ్లాక్ ఆడమ్’. డ్వేన్ జాన్సన్ హీరోగా నటించిన ఈ చిత్రం డీసీ కామిక్స్ ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రం షాజమ్కి స్పిన్ఆఫ్. ఈ చిత్రానికి జౌమ్ కొల్లెట్-సెర్రా దర్శకత్వం వహించగా.. ఆల్డిస్ హాడ్జ్, నోహ్ సెంటినియో, సారా షాహి, మార్వాన్ కెంజారీ, క్విన్టెస్సా స్విండెల్, పియర్స్ బ్రాస్నన్ కీలకపాత్రల్లో నటించారు. న్యూ లైన్ సినిమా, డీసీ ఫిల్మ్స్, సెవెన్ బక్స్ ప్రొడక్షన్స్, ఫ్లిన్పిక్చర్ కో కలిసి ఈ చిత్రాన్ని తెరకెక్కించాయి. ఇటీవలే థియెటర్స్లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్నారు.
జీ5 (Zee5)
Karthigai Deepam - తమిళం
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney Plus Hotstar)
Moving In With Malaika - ఇంగ్లిష్
నెట్‌ఫ్లిక్స్ (Netflix)
Mighty Express: Mighty Trains Race - ఇంగ్లిష్
అమెజాన్ ప్రైమ్ (Amazon Prime)
Boxing Day - ఇంగ్లిష్
