నూయ్య సాంగ్స్‌

గుడ్‌లక్‌ సఖీ

విడుదలైన పాట:

ఇంతందంగా ఉంటుందా ఈ లోకం

నటీనటులు: కీర్తి సురేష్‌, ఆది పినిశెట్టి, జగపతిబాబు

గీత రచయిత: శ్రీమణి

సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌

పాడింది: దేవిశ్రీ ప్రసాద్‌, మంగ్లీ

దర్శకుడు: నగేష్‌ కుకునూర్‌

నిర్మాణం: ఏ వర్త్‌ ఏ షాట్‌ మోషన్‌ ఆర్ట్స్‌ ప్రొడక్షన్స్‌


ఏమిటి ప్రత్యేకత:  ఈ సినిమాలో కీర్తి బంజారా అమ్మాయిగా కనిపించబోతోంది. ఈ పాటలోనూ కొన్ని బంజారా పదాలు వినిపిస్తాయి. ‘గుడ్‌ లక్‌ సఖీ’ ఓ స్పోర్ట్స్‌ డ్రామా. ఎలాంటి నేపథ్యం లేని ఓ అమ్మాయి, నష్ట జాతకురాలిగా ముద్ర వేయించుకున్న ఓ అమ్మాయి... విజేతగా ఎలా నిలిచిందన్నది కథ. తనకో లవ్‌ స్టోరీ కూడా ఉంది. ఆ నేపథ్యంలోనే ఈ పాట వస్తుంది. ఈనెల 10న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. 


రాధే శ్యామ్‌

విడుదలైన పాట: నగుమోము తారలే

నటీనటులు: ప్రభాస్‌, పూజా హెగ్డే

గీత రచయిత: కె.కె

సంగీతం: జస్టిన్‌ ప్రభాకరన్‌

పాడింది: సిద్ద్‌ శ్రీరామ్‌

దర్శకుడు: రాధాకృష్ణ

నిర్మాణం: యూవీ క్రియేషన్స్‌

ఏమిటి ప్రత్యేకత: రోమియోలాంటి అబ్బాయి, జూలియట్‌ లాంటి అమ్మాయి మధ్య సాగే ప్రేమ కథ ఇది. ఆ పాత్రలలో ప్రభాస్‌, పూజా హెగ్డే నటించారు. వీరిద్దరి మధ్య కెమిస్ర్టీ ఈ పాటలో అద్భుతంగా కుదిరింది. యూరప్‌ నేపథ్యం, కాస్ట్యూమ్స్‌, స్టైలింగ్‌ అన్నీ ఈ పాటలో చక్కగా కుదిరాయి. ‘‘నువ్వేమైనా రోమియో అనుకుంటున్నావా? నేను మాత్రం జూలియట్‌ నే. నాతో ప్రేమలో పడితే చస్తావ్‌’’ అనే డైలాగ్‌తో ఈ పాట మొదలైంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు.


అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.