'రాజా విక్రమార్క' కొత్త పోస్టర్ రిలీజ్

ABN , First Publish Date - 2021-07-21T19:57:21+05:30 IST

యంగ్ హీరో కార్తికేయ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా విక్రమార్క' నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ చిత్రానికి శ్రీ సరిపల్లి దర్శకత్వం వహిస్తుండగా శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆది రెడ్డి టి సమర్పణ లో 88 రమా రెడ్డి చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

'రాజా విక్రమార్క' కొత్త పోస్టర్ రిలీజ్

యంగ్ హీరో కార్తికేయ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా విక్రమార్క' నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ చిత్రానికి శ్రీ సరిపల్లి దర్శకత్వం వహిస్తుండగా శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆది రెడ్డి టి సమర్పణ లో 88 రమా రెడ్డి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ - కాన్సెప్ట్ వీడియో - ఫస్ట్ లుక్‌లకి ప్రేక్షకులనుంచి పాజిటివ్ రెస్పాన్ వచ్చింది. ఈ క్రమంలో తాజాగా బక్రీద్ పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని 'రాజా విక్రమార్క' చిత్రం నుండి ఆసక్తికరమైన పోస్టర్‌ను వదిలారు. ఇందులో కార్తికేయ ఎన్. ఐ ఎ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా, తాన్యా రవిచంద్రన్ టాలీవుడ్‌కి హీరోయిన్‌గా పరిచయమవుతోంది. సాయి కుమార్ - తనికెళ్ళ భరణి - సుధాకర్ కోమాకుల - పశుపతి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కార్తికేయ గత చిత్రం 'చావు కబురు చల్లగా' నిరాశపరచడంతో 'రాజా విక్రమార్క'తో గట్టి హిట్ కొట్టి ఫాంలోకి రావాలని పట్టుదలగా ఉన్నాడు. చూడాలి మరి 'రాజా విక్రమార్క' ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో. 



Updated Date - 2021-07-21T19:57:21+05:30 IST