తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..
ABN , First Publish Date - 2022-10-12T13:58:59+05:30 IST
కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ..

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ.. బోరింగ్‌గా ఫీల్ అవుతున్న సినీ లవర్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించాయి. అయితే కరోనా తగ్గుముఖం పట్టాక ఓటీటీల జోరు తగ్గి థియేటర్ రిలీజ్‌లు మళ్లీ పెరుగుతాయని అందరూ అనుకున్నారు.
కానీ అనుహ్యంగా వాటి ప్రాబల్యం ఏ మాత్రం తగ్గకపోగా.. రోజు రోజుకి స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ అదరగొడుతున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన కొన్ని సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. మరి కొన్నైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. కాగా అక్టోబర్ 11న ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..
ఇలిజా ష్లెసింగర్: హాట్ ఫర్‌ఎవర్ (Iliza Shlesinger: Hot Forever)
ఇలిజా ష్లెసింగర్: హాట్ ఫర్‌ఎవర్ కొన్ని కథలు, వృత్తాంతాల సమాహారం. సిరీస్ మొత్తం చాలా ఫన్నీగా సాగుతూనే ఆలోచింప జేస్తుంది. ప్రధాన పాత్రధారి జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు మనల్ని ఓ వైపు నవ్వస్తూనే.. మరోవైపు తర్కంతో ఆలోచించేలా చేస్తుంది. స్టీవ్ పాలే దర్శకత్వం వహించిన ఈ డాక్యుమెంటరీతో ఇలిజా ష్లెసింగర్ అనే నటి తన పాత్రని పొషించింది. ఈ డాక్యుమెంటరీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney Plus Hotstar)
Dating These Nights - ఇంగ్లిష్, హిందీ
Avenue 5- ఇంగ్లిష్
నెట్‌ఫ్లిక్స్ (Netflix)
The Cage - ఇంగ్లిష్, అరబిక్
Deaw 13 Thai Stand Up Comedy - థాయ్
The Lie Eater - జపనీస్
మూబీ (Mubi)
Father's Little Dividend - ఇంగ్లిష్
అమెజాన్ ప్రైమ్ (Amazon Prime)
Hallelujah: Leonard Cohen, A Journey, A Song - ఇంగ్లిష్
సమ్‌వన్ బారోవుడ్ (Someone Borrowed)
సమ్‌వన్ బారోవుడ్ ఓ పోర్చుగీస్ మూవీ. అసలు టైటిల్ ఎప్సోసా డే అలుగ్వెల్. మొండి పట్టుదల గల ఓ బ్యాచ్‌లర్ తల్లి అనారోగ్య కారణాలతో మరణానికి దగ్గరగా ఉంటుంది. ఆమె చివరి కోరిక తీర్చడానికి తనకి భార్యగా నటించడానికి ఓ నటిని నియమించుకుంటాడు. ఆ తర్వాత ఏం జరగిందనేది ఈ చిత్ర కథాంశం.

