మేకప్ లేకుండా Urfi Javed వీడియో.. పెదవికి సర్జరీ చేసుకోమంటూ ట్రోలింగ్

హిందీ టెలివిజన్ పరిశ్రమలోని బోల్డ్ నటీమణులలో ఒకరు ఉర్ఫీ జావేద్. బిగ్‌బాస్‌తో పాపులారిటీ సాధించిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ఇటీవల రకరకాలుగా వేషధారణలతో వీడియోలు చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేస్తుంటుంది ఈ భామ. అయితే వాటిపై ఎక్కువగా ట్రోలింగ్‌కి గురవుతూ ఉంటుంది.


మెట్ గాలా 2018లో ఆకట్టుకున్న హాలీవుడ్ నటి రిహన్నా లుక్స్‌ని అనుకరిస్తూ.. మంగళవారం రోజు ఓ వీడియోని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది ఉర్ఫీ. దానిపై విపరీతంగా ట్రోల్ చేశారు నెటిజన్లు. అయిన కూడా ఏ మాత్రం ఇబ్బంది పడని ఈ భామ తాజాగా మరో రీల్‌ని చేసింది. అందులో ఎటువంటి మేకప్ లేకుండా ఉన్న ఈ నటి.. వెంటనే మేకప్‌తో అందంగా మారిపోతుంది. దీనికి మీకు ఎంత సమయం పడుతుందంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. దీనిపై  మరోసారి ట్రోల్ చేశారు నెటిజన్లు.


‘చెత్త ఎప్పుడూ చెత్తేనని’ ఒక నెటిజన్ కామెంట్ పెట్టగా.. ‘మేకప్ లేకుండా ఆమెను చూడలేమ‌’ని మరొకరు వ్యాఖ్యానించాడు. ‘ఎందుకు మీరు ఎప్పుడూ దాహంతో ఉన్నట్లు కనిపిస్తారు’, ‘బాగాలేద’ని కొందరు కామెంట్స్ పెట్టారు. అంతేకాకుండా మరి కొంతమందైతే ‘నిన్ను చూసి మేకప్ లేకుండా చూసి.. చాలా భయం వేసింద’ని, ‘ముందు నీ పెదవికి సర్జరీ చేయించుకోమ’ని ట్రోల్ చేశారు. అయతే ఏది ఏమైనప్పటికీ ఉర్ఫీ ఇలాంటి ట్రోల్స్‌ని పట్టించుకోకుండా.. రకరకాల వేషధారణలతో నెటిజనుల అలరిస్తూనే ఉంది. ఈ విషయంలో ఈ బ్యూటీ తప్పకుండా మెచ్చుకోవాల్సిందే..


Bollywoodమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.