కంగనా వ్యాఖ్యలపై నెట్టింట్లో దుమారం.. ఎఫ్ఐఆర్ ఫైల్, పద్మశ్రీ వెనక్కి తీసుకోవాలంటూ ట్రోల్స్
ABN , First Publish Date - 2021-11-11T23:03:33+05:30 IST
ఇక నెటిజెన్లు అయితే కంగనాపై విపరీతమైన ట్రోల్స్ వేస్తున్నారు. ఇంతటితో ఆగకుండా తాజాగా ఆమెకు ఇచ్చిన ‘పద్మశ్రీ’ అవార్డును వెనక్కి తీసుకోవాలంటూ రాష్ట్రపతిని డిమాండ్ చేస్తున్నారు. ఇక కంగనా చేసిన వ్యాఖ్యలు గాంధీ, నెహ్రూ సహా అనేకమంది స్వాతంత్ర్య యోధులను అవమానించినట్లు ఉందంటూ..

న్యూఢిల్లీ: పదే పదే వివాదాస్పద వ్యాఖ్యలు చేసే బోల్డ్ బ్యూటీ కంగనా మరోసారి అదే పని చేసింది. ‘‘1947లో మనకు దక్కింది ‘భిక్ష’ మాత్రమే. నిజమైన స్వాతంత్ర్యం 2014లో వచ్చింది’’ అంటూ మోదీ ప్రధాని అవ్వటాన్ని ఉద్దేశిస్తూ కంగనా ఓ కామెంట్ చేసింది. దీంతో కంగనా వ్యాఖ్యలపై నెట్టింట్లో పెద్ద చర్చ జరుగుతోంది. అతికొద్ది మంది కంగనా వ్యాఖ్యలను సమర్ధిస్తుండగా.. అనేక మంది ఆమె తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కాగా, ఈసారి రియాక్షన్ ఎవరూ ఊహించని వ్యక్తి నుంచి కంగనాకు కౌంటర్ వచ్చింది. గాంధీ కుటుంబ వారసుడు కంగనా స్టేట్మెంట్‌ను తప్పు పట్టారు. అయితే, ఆయన రాహుల్ గాంధీ కాదు. బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ... ‘‘ఇది పిచ్చి అనాలా... లేక దేశ ద్రోహం అనాలా’’ అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు.
ఇక నెటిజెన్లు అయితే కంగనాపై విపరీతమైన ట్రోల్స్ వేస్తున్నారు. ఇంతటితో ఆగకుండా తాజాగా ఆమెకు ఇచ్చిన ‘పద్మశ్రీ’ అవార్డును వెనక్కి తీసుకోవాలంటూ రాష్ట్రపతిని డిమాండ్ చేస్తున్నారు. ఇక కంగనా చేసిన వ్యాఖ్యలు గాంధీ, నెహ్రూ సహా అనేకమంది స్వాతంత్ర్య యోధులను అవమానించినట్లు ఉందంటూ ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కార్యనిర్వాహక చైర్మెన్ ప్రీతి మీనన్ కేసు నమోదు చేశారు.
కాగా, బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ చేసిన విమర్శలే ఇప్పుడు హాట్ టాపిక్‌గా ఉన్నాయి. తన ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ ‘‘మహాత్మా గాంధీ త్యాగాన్ని అవమానించటం కొన్నిసార్లు, ఆయన హంతకుడ్ని కీర్తించటం కొన్నిసార్లు, ఇక ఇప్పడు... మంగళ్ పాండే, రాణీ లక్ష్మీభాయి, భగత్ సింగ్, లక్షలాది మంది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల్ని సైతం చులకన చేయటం! దీన్ని ఏమనాలి... పిచ్చా? లేక దేశ ద్రోహమా?’’ అంటూ ట్విట్టర్‌లో కంగనాని విమర్శించారు.
ఇంతకాలం కంగనాకు వ్యతిరేకంగా బీజేపీయేతర పార్టీల వాళ్లు మాత్రమే మాట్లాడేవారు. ఆమె కమలదళానికి సపోర్ట్‌గా కామెంట్స్ చేస్తుండటంతో కాషాయ నాయకులు విమర్శించలేదు. ఓ బీజేపీ ఎంపీ అమెని తప్పుబట్టటం ఇదే మొదటిసారి. అయితే, బీజేపీ నేతగా ఉన్న వరుణ్ గాంధీకి గత కొంత కాలంగా మోదీ, అమిత్ షాతో సంబంధాలు దెబ్బతిన్నాయి. దాంతో మోదీని ఆకాశానికి ఎత్తేస్తోన్న కంగనా రనౌత్‌పై ఆయన స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యి ఉండవచ్చని భావించవచ్చు.
కంగనాపై నెటిజెన్లు వేస్తున్న ట్రోల్స్‌లో కొన్ని..