Kareena Kapoor ను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

ABN , First Publish Date - 2021-10-11T23:16:52+05:30 IST

ప్రపంచమంతా కుగ్రామం అయిపోయింది. సైబర్ యుగంలో మనం ఉన్నాం. ఈ సోషల్ మీడియా కాలంలో బుల్లీయింగ్, ట్రోలింగ్ ఎక్కువయ్యాయి. సినీ, రాజకీయ సెలెబ్రిటీలతో సహా ఎవరూ దీనికి అతీతులు కారు.

Kareena Kapoor ను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

ప్రపంచమంతా కుగ్రామం అయిపోయింది. సైబర్ యుగంలో మనం ఉన్నాం. ఈ సోషల్ మీడియా కాలంలో బుల్లీయింగ్, ట్రోలింగ్ ఎక్కువయ్యాయి. సినీ, రాజకీయ సెలెబ్రిటీలతో సహా ఎవరూ దీనికి అతీతులు కారు. ఆమిర్ ఖాన్, ఆలియా భట్, రష్మిక మందన్న‌లను వివిధ కారణాలతో నెటిజన్లు ట్రోల్ చేశారు. ఆ ఘటనలను మరిచిపోకమందే నెటిజన్లు మరో హీరోయిన్‌ను ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు.


ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్ అక్టోబర్ 10న లాక్మే ఫ్యాషన్ వీక్‌ గ్రాండ్ ఫినాలేలో పాల్గొన్నారు. గౌరవ్ గుప్తా డిజైన్ చేసిన వైట్ గౌన్‌ను ధరించి ఆమె ర్యాంప్‌పై సందడి చేశారు. #డిఫైన్ టు రీఫైన్ అనే థీమ్‌ ఆధారంగా ఆ గౌన్‌ను గౌరవ్ డిజైన్ చేశారు. కరీనా కపూర్ ధరించిన దుస్తులతో నెటిజన్లు సంతోషంగా లేరు. ఆమెను ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. 


ఇన్‌స్టాగ్రామ్‌లో వివిధ రకాల కామెంట్లు చేస్తూ ట్రోలింగ్‌కి దిగారు. ‘‘మీకు వయసు చాలా ఎక్కువైంది. దానిని అంగీకరించండి’’ అని యూజర్ కామెంట్ చేశారు. ‘‘ ఆమె మోచేతులు మా నాన్న కంటె పెద్దవిగా ఉన్నాయి’’ అని ఒక నెటిజన్ ట్రోల్ చేశారు. ‘‘వయసు మళ్లీన ఆంటీ’’ అని మరొక నెటిజన్ ఆమెను దూషించారు.


ర్యాంప్ వాక్ చేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘ రెండో సంతానం పుట్టాక 7నెలలకే ర్యాంప్ వాక్ చేస్తున్నాను. ర్యాంప్ పై నడవడంతో నాకు చాలా సంతోషంగా ఉంది. గౌరవ్ ధరించిన దుస్తులతోనే 2015లో నేను క్యాట్ వాక్ చేశాను. అప్పుడు నాకు తైమూర్, జై పుట్టలేదు. వారు ఇద్దరూ పుట్టిన తర్వాత ఇదే మొదటిసారి ’’ అని కరీనా కపూర్ తెలిపారు.   


Updated Date - 2021-10-11T23:16:52+05:30 IST