గత కొన్ని రోజులుగా ఆమీర్ ఖాన్ (Aamir Khan) నటించిన ‘లాల్ సింగ్ చడ్డా(Laal Singh Chaddha)’ చిత్రాన్ని నెటిజన్లు టార్గెట్ చేస్తున్నారు. గతంలో ఆమీర్ ‘ఇండియాలో అసహనం ఉంది’ అని, కరీనా కపూర్ ‘నెపో కిడ్స్ చూడకండి’ అంటూ వెటకారంగా మాట్లాడడం వారికి కోపం తెప్పించింది. అందుకే Boycott LaalSingh Chaddha సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు. తాజాగా అక్షయ్ కుమార్ (Akshay Kumar) నటించిన ‘రక్షా బంధన్’ను సైతం టార్గెట్ చేశారు. ప్రస్తుతం Boycott RakshaBandhan యాష్‌ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. దీనికి చాలా కారణాలు ఉండగా.. ముఖ్యమైన కారణంగా మాత్రం ఈ సినిమాకి రచయితగా ఉన్న కనికా ధిల్లాన్(Kanika Dhillon).
రెండేళ్ల క్రితం కనికా చేసిన ట్వీట్ల ప్రభావం ప్రస్తుతం ఈ సినిమాపై పడేలా ఉంది. అప్పట్లో.. జేఎన్‌యూ విద్యార్థులకి మద్దతు తెలిపిన కనిక ఇండియాలో పరిస్థితులు దిగజారుతున్నట్లు ట్వీట్స్ పెట్టింది. వాటిని పలువురు నెటిజన్లు తాజాగా షేర్ చేస్తున్నారు. ‘మేము హిందువులం. ఈ సినిమా రచయిత కనికా ధిల్లాన్‌ను బహిష్కరిస్తాం. మీరు ఆమె పోస్ట్‌ను సోషల్ మీడియాలో చూడండి. ఆమెకి మేమేంటో చూపుతాం’ అంటూ ఘాటుగా రాసుకొచ్చాడు.
కాగా.. ‘లాల్ సింగ్ చడ్డా’, ‘రక్షా బంధన్’ చిత్రాలు ఒకేరోజు అంటే 11 ఆగస్టు 2022న విడుదల కానున్నాయి. ఈ సినిమాల ట్రైలర్‌లు, పాటలు ఇప్పటికే విడుదలై మంచి బజ్‌ని క్రియేట్ చేశాయి. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తాయని భావిస్తున్నారు.