Karthikeya 2: ఆ రెండు సినిమాలను తీసేయండి.. ‘కార్తికేయ-2’కు థియేటర్లు ఇవ్వండంటూ నెటిజన్స్ డిమాండ్

ABN , First Publish Date - 2022-08-17T20:38:17+05:30 IST

హీరో నిఖిల్ సిద్దార్థ్ (Nikhil Siddharth) గతంలో నటించిన చిత్రం ‘కార్తికేయ’ (Karthikeya). తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ ‘కార్తికేయ-2’ (Karthikeya 2) రూపొందింది. చందు మొండేటి దర్శకత్వం దర్శకత్వం

Karthikeya 2: ఆ రెండు సినిమాలను తీసేయండి.. ‘కార్తికేయ-2’కు థియేటర్లు ఇవ్వండంటూ నెటిజన్స్ డిమాండ్

హీరో నిఖిల్ సిద్దార్థ్ (Nikhil Siddharth) గతంలో నటించిన చిత్రం ‘కార్తికేయ’ (Karthikeya). తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ ‘కార్తికేయ-2’ (Karthikeya 2) రూపొందింది. చందు మొండేటి దర్శకత్వం దర్శకత్వం వహించాడు. అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, శ్రీనివాస్ రెడ్డి, వైవా హర్ష కీలక పాత్రలు పోషించారు. పాన్ ఇండియాగా తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 13న విడుదలైంది. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే ఈ సినిమాకు అభిమానుల మన్ననలతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో సంచలన విజయం సాధించింది. మూవీని కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్స్‌కు నాలుగు రోజుల్లోనే లాభాలను పంచడం మొదలుపెట్టింది. బాలీవుడ్‌ బాక్సాఫీస్ వద్ద సైతం ‘కార్తికేయ-2’ హిందీ వెర్షన్ భారీ వసూళ్లను రాబడుతుంది. 


హిందీ బెల్ట్‌లో ‘కార్తికేయ-2’కు సంబంధించి తొలిరోజు 50షోస్‌ను ప్రదర్శించారు. ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించడంతో డిస్ట్రిబ్యూటర్స్ ఆ షోస్‌ను క్రమంగా పెంచడం మొదలుపెట్టారు. ఫలితంగా ఐదు రోజుల్లోనే షోస్ సంఖ్య 1575కు చేరింది. సినిమా విడుదలైన తొలి రోజు రూ. 7లక్షల వసూళ్లను రాబట్టగా, మూడో రోజు నాటికి ఆ వసూళ్లు రూ. 1.43కోట్లకు చేరాయి. బాలీవుడ్‌లో ఆగస్టు 11న రెండు భారీ బడ్జెట్ చిత్రాలు ‘లాల్ సింగ్ చడ్డా’ (Laal Singh Chaddha), ‘రక్షా బంధన్’ (Raksha Bandhan) విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ‘కార్తికేయ’ హిందీ వెర్షన్‌ బాక్సాఫీస్ వద్ద హౌస్‌ఫుల్ బోర్డులతో దూసుకుపోతుంది. అయినప్పటికీ, అన్ని ప్రాంతాల్లోని థియేటర్స్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శించడం లేదు. ఫలితంగా కొంత మంది ప్రేక్షకులు ఆ రెండు సినిమాలను తొలగించి ‘కార్తికేయ‌-2’ కు థియేటర్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో మల్టీప్లెక్స్ సంస్థలను ట్యాగ్ చేస్తూ వరుస పోస్ట్‌లు పెడుతున్నారు.



Updated Date - 2022-08-17T20:38:17+05:30 IST