Viral Video: Shah Rukh Khan కూతురిపై నెటిజన్స్ ఆగ్రహం.. పద్ధతి మార్చుకోమంటూ కామెంట్స్..!

ABN , First Publish Date - 2022-06-25T02:02:56+05:30 IST

సినిమాల్లోకి రాకముందే బాలీవుడ్ స్టార్స్ వారసులకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అలా క్రేజ్ సంపాదించుకున్న స్టార్ వారసురాలే సుహానా ఖాన్ (Suhana Khan). బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్

Viral Video: Shah Rukh Khan కూతురిపై నెటిజన్స్ ఆగ్రహం.. పద్ధతి మార్చుకోమంటూ కామెంట్స్..!

సినిమాల్లోకి రాకముందే బాలీవుడ్ స్టార్స్ వారసులకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అలా క్రేజ్ సంపాదించుకున్న స్టార్ వారసురాలే సుహానా ఖాన్ (Suhana Khan). బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ (shahrukh khan) కుమార్తెనే సుహానా. విదేశాల్లో చదువుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడు చురుకుగా ఉంటూ పోస్ట్‌లు పెడుతుంటుంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కు 28లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు. తాజాగా నెటిజన్స్ సుహానాను ట్రోల్ చేస్తున్నారు. అందుకు కారణమేంటంటే.. 


సెలబ్రిటీలు ఎక్కడ ఉన్న ఫొటోగ్రాఫర్స్ అక్కడకు వాలిపోతారన్న సంగతి తెలిసిందే. సుహానా ఓ పని నిమిత్తం బయటకు వెళ్లింది. కారు దిగి వెంటనే లోపలికి వెళ్లిపోయింది. ఫొటోగ్రాఫర్స్ కొంత మంది ఫోజులివ్వమని అడిగిన పట్టించుకోలేదు. దీంతో నెటిజన్స్ ఆమెను ట్రోల్ చేయడం ప్రారంభించారు. ‘చాలా ఘోరంగా ప్రవర్తిస్తుంది’ అని ఓ నెటిజన్ పోస్ట్ పెట్టారు. ‘‘ఆమె ఆటిట్యూడ్ బాగాలేదు. షారూక్ ఖాన్ అయితే ఈ విధంగా చేసేవాడు కాదు’’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. కొంత మంది నెటిజన్స్ పద్ధతి మార్చుకొమంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తుంది. సుహానా సినీ ఇండస్ట్రీలోకి త్వరలోనే ఎంట్రీ ఇవ్వనుంది. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ జోయా అక్తర్ (Zoya Akhtar) నిర్మిస్తున్న ‘ద అర్చీస్’ (The Archies)లో నటిస్తుంది. ఈ షోలో బిగ్ బీ మనవడు అగస్త్య నందా(Agastya Nanda), బోనీ కపూర్ వారసురాలు ఖుషి కపూర్ (Khushi Kapoor ) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సుహానాకు ఎంటర్ ప్రెన్యూర్ లక్షణాలు కూడా ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున వేలంలో ఆమె పాల్గొన్న సంగతి తెలిసిందే.



Updated Date - 2022-06-25T02:02:56+05:30 IST