Janhvi Kapoor డ్రస్‌పై సెటైర్లు పేల్చుతున్న నెటిజన్లు.. రాత్రి వేసుకునే దుస్తుల్తోనే బయట తిరుగుతోందంటూ..

Twitter IconWatsapp IconFacebook Icon
Janhvi Kapoor డ్రస్‌పై సెటైర్లు పేల్చుతున్న నెటిజన్లు.. రాత్రి వేసుకునే దుస్తుల్తోనే బయట తిరుగుతోందంటూ..

అందాల తార శ్రీదేవి (Sridevi) కూతురిగా బాలీవుడ్‌కి పరిచయమై అందంతోపాటు అభినయంతో ఆకట్టుకున్న నటి జాన్వీ కపూర్‌. ఈ బ్యూటీ సినిమాలకే కాకుండా ఫ్యాషన్ సెన్స్‌కి సైతం ఎంతోమంది అభిమానులు ఉన్నారు.‌‌‌ సోషల్ మీడియా(Social Media)లో ఎంతో యాక్టివ్‌గా ఉంటూ కొత్త ఫ్యాషన్‌ని ఫాలోయర్స్‌కి పరిచయం చేస్తూ ఉంటుంది. ఆ పిక్స్‌ని అప్‌లోడ్ చేసిన కొద్దిసేపట్లోనే వైరల్‌గా మారుతూ ఉంటాయి. అయితే కొన్నిసార్లు ఈ భామ ఫ్యాషన్ డిజాస్టరై ట్రోలింగ్‌కి సైతం గురవుతూ ఉంటుంది. తాజాగా జాన్వీ అలాంటి పరిస్థితినే ఎదుర్కొంది.


ఇటీవల జాన్వీ కపూర్ ఒక రెస్టారెంట్‌కి వెళుతూ మీడియా కంటపడింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో.. ఈ బ్యూటీ నలుపు రంగు డ్రెస్ ఎంతో స్టైలిష్‌గా కనిపించింది. ఎంతోమంది నెటిజన్లకి తన డ్రెస్సింగ్ నచ్చడంతో బావుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే.. ఆ డ్రెస్ కొంచెం పొట్టిగా ఉండడం, మాటీమాటికి సర్దుకుంటూ ఉండడం పలువురు నెటిజన్ల ఆగ్రాహానికి కారణమైంది. దీంతో ట్రోలింగ్ చేయడం ప్రారంభించారు. ‘కంఫర్ట్ లేకుంటే ఎందుకు వేసుకున్నావు’ అంటూ కొందరు.. ‘రాత్రి వేసుకునే నైట్ డ్రెస్ వేసుకుని మర్చిపోయి అలాగే వచ్చేశావా’ అంటూ మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. ఆ వైరల్ వీడియోపై మీరు ఓ సారి లుక్కేయండి..


AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.