Priyanka Chopra ధరించిన టీ షర్ట్, కళ్లజోడు గురించి హాట్ టాపిక్.. వాటి ధర ఎంతో తెలిసి అవాక్కవుతున్న నెటిజన్లు..!

ABN , First Publish Date - 2021-10-20T04:21:31+05:30 IST

బాలీవుడ్ నుంచీ హాలీవుడ్ దాకా ఎదిగిన ప్రియాంక చోప్రా ప్రస్తుతం పలు అంతర్జాతీయ ప్రాజెక్ట్స్‌తో బిజిబిజీగా ఉంది. మధ్యలో ఓ వెబ్ సిరీస్‌ కూడా చక్కబెట్టేస్తోంది. అయితే, తన డిజిటల్ షోకు సంబంధించి ఆమె ఇప్పుడు స్పెయిన్‌లో ఉంది. అక్కడ వెబ్ సిరీస్ షూటింగ్ విరామాల్లో సరదాగా ఫోటోలు తీసి ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేస్తోంది. అందమైన ఐరోపా దేశంలో అయస్కాంతంలా ఆకర్షిస్తోంది 39 ఏళ్ల బ్యూటీ!

Priyanka Chopra ధరించిన టీ షర్ట్, కళ్లజోడు గురించి హాట్ టాపిక్.. వాటి ధర ఎంతో తెలిసి అవాక్కవుతున్న నెటిజన్లు..!

బాలీవుడ్ నుంచీ హాలీవుడ్ దాకా ఎదిగిన ప్రియాంక చోప్రా ప్రస్తుతం పలు అంతర్జాతీయ ప్రాజెక్ట్స్‌తో బిజిబిజీగా ఉంది. మధ్యలో ఓ వెబ్ సిరీస్‌ కూడా చక్కబెట్టేస్తోంది. అయితే, తన డిజిటల్ షోకు సంబంధించి ఆమె ఇప్పుడు స్పెయిన్‌లో ఉంది. అక్కడ వెబ్ సిరీస్ షూటింగ్ విరామాల్లో సరదాగా ఫోటోలు తీసి ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేస్తోంది. అందమైన ఐరోపా దేశంలో అయస్కాంతంలా ఆకర్షిస్తోంది 39 ఏళ్ల బ్యూటీ!


ప్రియాంక ఆన్‌లైన్ ఫోటోలు, వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్ అవ్వటం, హాట్ టాపిక్స్‌గా మారటం షరా మామూలే. అయితే, తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఓ పిక్ చాలా మందిని ఆశ్చర్యపోయేలా చేస్తోంది. అలాగని మన పిసీ హాట్‌గా బికినీ షో ఏం చేయలేదు. అలాగని నిండుగా పట్టుచీర కూడా కట్టేయలేదు. సింపుల్‌గా జీన్స్ వేసి, టీ షర్ట్ ధరించింది. కళ్లకి సన్ గ్లాసెస్ పెట్టుకుంది. దట్సాల్! 


జీన్స్, టీ షర్ట్, కళ్లద్దాలు... ఇంతే అయితే ‘దేసీగాళ్’ గురించి మాట్లాడుకునే పనేలేదు! మన ‘గ్లోబల్ స్టార్’ అసలు ట్విస్ట్... తన బ్రాండెడ్ దుస్తులు, గాగుల్స్‌తో ఇచ్చింది! ప్రియాంక ధరించిన ‘గ్రీన్ కలర్డ్ స్ట్రైప్స్ టీ షర్ట్’ 6 వేల రూపాయలట! అంతకంటే అవాక్కయ్యేలా... మిసెస్ జోనాస్ కళ్లకు పెట్టుకున్న అద్దాలు... 26 వేలట! లాస్ ఏంజిల్స్‌లో మకాం పెట్టేసిన ఈ ఇండియన్ హాలీవుడ్ ఏంజిల్... ఆ మాత్రం ఖరీదైన అలంకారాలు చేసుకోకపోతే ఆశ్చర్యం కానీ... చేసుకుంటే విస్తుపోవాల్సింది ఏముంది చెప్పండి? ఆశ్చర్యమేం కాదు కదా!  


Updated Date - 2021-10-20T04:21:31+05:30 IST