NETFLIX : 150 కోట్ల ఖర్చు... 6,700 కోట్ల లాభం!

ABN , First Publish Date - 2021-10-18T03:36:39+05:30 IST

‘స్క్విడ్ గేమ్’... ఇప్పుడు చాలా మంది నెటిజన్స్ నోట వినిపిస్తోన్న మాట. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సూపర్ డూపర్ హిట్టైంది. ఓ రిస్కీ రియల్ లైఫ్ గేమ్ ఆధారంగా స్టోరీ నడుస్తుంటుంది. అయితే...

NETFLIX : 150 కోట్ల ఖర్చు... 6,700 కోట్ల లాభం!

‘స్క్విడ్ గేమ్’... ఇప్పుడు చాలా మంది నెటిజన్స్ నోట వినిపిస్తోన్న మాట. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సూపర్ డూపర్ హిట్టైంది. ఓ రిస్కీ రియల్ లైఫ్ గేమ్ ఆధారంగా స్టోరీ నడుస్తుంటుంది. అయితే, ఇప్పటికే ఎన్నో సంచలనాలు సృష్టించిన ‘స్క్విడ్ గేమ్’ మరో దుమారానికి తెర తీసింది. నెట్‌ఫ్లిక్స్ కంపెనీ అంతర్గత లెక్కల ప్రకారం సదరు షో విలువ 900 మిలియన్ అమెరికన్ డాలర్లుగా అంచనా వేస్తున్నారట. 


ఓటీటీల్లో సబ్‌స్క్రైబర్స్ ఎప్పటికప్పుడు టికెట్లు కొని సినిమాలు, షోస్ చూడరు. ఒకేసారి డబ్బులు చెల్లించి నిర్ధిష్ట కాలం పాటూ అందుబాటులో ఉన్న సినిమా, సిరీస్‌లు, షోస్ ఏవైనా వీక్షిస్తుంటారు. అందుకే, ఆన్‌లైన్‌‌లో విడుదలైన దేనికి కూడా కలెక్షన్ పరంగా ప్రచారం చేసుకునే వీలుండదు. అయితే, నెట్‌ఫ్లిక్స్ తన వ్యవస్థలో అంతర్గతంగా ‘ఇంపాక్ట్ వాల్యూ’ అనే కొలమానం పెట్టుకుంది. వివిధ లెక్కలు, కూడికలు, తీసివేతల తరువాత ప్రతీ షోకి ఓ ‘ఇంపాక్ట్ వాల్యూ’ నిర్ణయిస్తారు. దాన్ని బట్టీ అది కంపెనీకి ఎంత వరకూ ఆర్దికంగా విలువ చేకూర్చిందో తెలుస్తుంది. ఆ క్రమంలోనే సూపర్ హిట్ షో ‘స్క్విడ్ గేమ్’ దాదాపు 900 మిలియన్ల అమెరికన్ డాలర్స్ వద్ద నిలిచిందట! అంటే, మన కరెన్సీలో ఇంచుమించూ 6,700 కోట్లుగా భావించవచ్చు... 


నెట్‌ఫ్లిక్స్‌కు ప్రపంచ వ్యాప్తంగా బోలెడు విలువ జత చేసిన ‘స్క్విడ్ గేమ్’ నిర్మాణానికి కేవలం 21 మిలియన్ డాలర్ల బడ్జెట్ అవసరమైందట. అంటే, 150 కోట్లు వెచ్చించి డిజిటల్ స్ట్రీమింగ్ జెయింట్ ఏకంగా 6 వేల కోట్లకు పైగా లాభం పొందిందన్నమాట! ‘స్క్విడ్ గేమ్’ మారిపోతోన్న ప్రపంచ వినోద రంగపు తీరుతెన్నులకి సుస్సష్టంగా అద్దం పడుతోందని చెప్పవచ్చు...  

Updated Date - 2021-10-18T03:36:39+05:30 IST