‘నేను లేని నా ప్రేమకథ’కు రిలీజ్ డేట్ ఫిక్స్

ABN , First Publish Date - 2021-09-30T01:12:24+05:30 IST

త్రిషాల ఎంటర్‌టైన్‌మెంట్స్, సరస్వతి క్రియేషన్స్, యస్.యస్.స్టూడియోస్ బ్యానర్లపై నవీన్ చంద్ర, గాయత్రి సురేష్ హీరోహీరోయిన్లుగా సురేష్ ఉత్తరాది దర్శకత్వంలో కళ్యాణ్ కందుకూరి, ఏ. భాస్కరరావు సంయుక్తంగా

‘నేను లేని నా ప్రేమకథ’కు రిలీజ్ డేట్ ఫిక్స్

త్రిషాల ఎంటర్‌టైన్‌మెంట్స్, సరస్వతి క్రియేషన్స్, యస్.యస్.స్టూడియోస్ బ్యానర్లపై నవీన్ చంద్ర, గాయత్రి సురేష్ హీరోహీరోయిన్లుగా సురేష్ ఉత్తరాది దర్శకత్వంలో కళ్యాణ్ కందుకూరి, ఏ. భాస్కరరావు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘నేను లేని నా ప్రేమకథ’. ఈ చిత్రం యుఎఫ్ఓ మూవీజ్ ఇండియా లిమిటెడ్ ద్వారా అక్టోబర్ 8న విడుదల కాబోతున్నట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది. క్రిష్ సిద్ధిపల్లి, అదితి మ్యాకల్, రాజా రవీంద్ర వంటి వారు ఈ చిత్రంలో ఇతర పాత్రల్లో నటించారు.


ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘వినూత్న కథాంశంతో, హృదయాన్ని హత్తుకునే సన్నివేశాలతో ‘నేను లేని నా ప్రేమకథ’ చిత్రం ఉంటుంది. మా ప్రయత్నాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లడానికి సహకరిస్తున్న యుఎఫ్ఓ మూవీజ్ ఇండియా లిమిటెడ్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యింది. అక్టోబర్ 8న చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నాం..’’ అని తెలిపారు. 

Updated Date - 2021-09-30T01:12:24+05:30 IST