Nenevaru: టీజర్‌ స్పందనతో టీమ్ హ్యాపీ

ABN , First Publish Date - 2022-11-11T03:25:37+05:30 IST

కౌశల్ క్రియేషన్స్ పతాకంపై.. ప్రముఖ ఎడిటర్ స్వర్గీయ కోలా భాస్కర్ తనయుడు కోలా బాలకృష్ణ హీరోగా, సాక్షి చౌదరి హీరోయిన్‌గా.. నిర్ణయ్ పల్నాటి దర్శకత్వంలో..

Nenevaru: టీజర్‌ స్పందనతో టీమ్ హ్యాపీ

కౌశల్ క్రియేషన్స్ పతాకంపై.. ప్రముఖ ఎడిటర్ స్వర్గీయ కోలా భాస్కర్ తనయుడు కోలా బాలకృష్ణ హీరోగా, సాక్షి చౌదరి హీరోయిన్‌గా.. నిర్ణయ్ పల్నాటి దర్శకత్వంలో భీమినేని శివప్రసాద్-తన్నీరు రాంబాబు నిర్మించిన చిత్రం ‘నేనెవరు’. పూనమ్ చంద్-కుమావత్-కిరణ్ కుమార్ మోటూరి సహ నిర్మాతలు. తనిష్క్ రాజన్, గీత్ షా సహాయ పాత్రల్లో, బాహుబలి ప్రభాకర్ విలన్‌గా నటించారు. రీసెంట్‌గా విడుదలైన ఈ చిత్ర టీజర్‌ మంచి స్పందనను రాబట్టుకుంటుండటంతో చిత్రయూనిట్ తమ సంతోషాన్ని తెలియజేసింది. ఈ చిత్రాన్ని నవంబర్ 25న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 


ఈ సందర్భంగా దర్శకుడు నిర్ణయ్ పల్నాటి మాట్లాడుతూ.. ‘‘తాజాగా విడుదలైన టీజర్‌కు చాలా మంచి స్పందన వస్తోంది. టీజర్‌ను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. లవ్ - సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుందని ఆశిస్తున్నాను. చిత్రానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెల 25న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం..’’ అని అన్నారు. ఈ సినిమా హీరో కోలా బాలకృష్ణకు, దర్శకుడు నిర్ణయ్‌కు, సంగీత దర్శకుడు ఆర్.జి.సారథిలకు.. చాలా మంచి పేరు తెస్తుందని నిర్మాతలు భీమినేని శివప్రసాద్ - తన్నీరు రాంబాబు పేర్కొన్నారు.

Updated Date - 2022-11-11T03:25:37+05:30 IST