నెలరాజుని.. ఇలరాణిని కలిపింది సిరివెన్నెల

ABN , First Publish Date - 2021-12-08T07:12:49+05:30 IST

నాని కథానాయకుడిగా నటించిన చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’. సాయి పల్లవి, కృతిశెట్టి కథానాయికలు. రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకుడు. వెంకట్‌ బోయినపల్లి నిర్మాత. ఈనెల 24న విడుదల అవుతోంది....

నెలరాజుని.. ఇలరాణిని కలిపింది సిరివెన్నెల

నాని కథానాయకుడిగా నటించిన చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’. సాయి పల్లవి, కృతిశెట్టి కథానాయికలు. రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకుడు. వెంకట్‌ బోయినపల్లి నిర్మాత. ఈనెల 24న విడుదల అవుతోంది. ఈ చిత్రంలోని ‘సిరివెన్నెల’ అనే గీతాన్ని మంగళవారం విడుదల చేశారు. ‘సిరివెన్నెల’ సీతారామశాస్ర్తి రచించిన ఈ పాటని అనురాగ్‌ కులకర్ణి ఆలపించారు. మిక్కీ జే.మేయర్‌ సంగీతం అందించారు. ‘‘నెలరాజునీ, ఇలరాణినీ కలిపింది కదా.. సిరివెన్నెల’’ అంటూ పాట మొదలైంది. ‘సిరివెన్నెల’తో గీత రచయితగా తన సినీ ప్రయాణాన్ని మొదలెట్లారు సిరివెన్నెల. చివరి పాటలో కూడా ‘సిరివెన్నెల’ ప్రస్తావన రావడం గమనించదగిన విషయం. ‘‘సిరివెన్నెల సీతారామశాస్ర్తి రచించిన పాట ఉండడం మా సినిమా సినిమా చేసుకున్న అదృష్టం. అందుకే ఈచిత్రాన్ని ఆయనకు అంకితం ఇస్తున్నాం. కథలో కీలకమైన సమయంలో వచ్చే గీతమిది. శ్రావ్యమైన మెలోడీ గీతానికి నాని, సాయిపల్లవి మరింత వన్నె తెచ్చారు. వాళ్ల కెమిస్ర్టీ కూడా ఆకట్టుకుంటుంద’’ని చిత్రబృందం తెలిపింది. మడోన్నా సెబాస్టియన్‌, రాహుల్‌ రవీంద్రన్‌, మురళీ శర్మ, అభినవ్‌ గోమటం కీలక పాత్రలు పోషించారు. కథ: సత్యదేవ్‌ జంగా, కెమెరా: సాను జాన్‌ వర్గీస్‌, కూర్పు: నవీన్‌ నూలి. 


Updated Date - 2021-12-08T07:12:49+05:30 IST