‘నీ జతగా’ వచ్చేందుకు సిద్ధం
ABN , First Publish Date - 2021-09-23T03:02:44+05:30 IST
శ్రీ సుబంద్రా క్రియేషన్స్ బ్యానర్‌పై.. భరత్ బండారు, జ్ఞానేశ్వరి, నయని పావని, ప్రవణ్ తదితరులు ప్రధాన తారాగణంగా భమిడిపాటి వీర దర్శకత్వంలో రామ్ బి నిర్మిస్తున్న చిత్రం ‘నీ జతగా’. ఈ నెలాఖారుకి చిత్రాన్ని విడుదల చేయడానికి

శ్రీ సుబంద్రా క్రియేషన్స్ బ్యానర్‌పై.. భరత్ బండారు, జ్ఞానేశ్వరి, నయని పావని, ప్రవణ్ తదితరులు ప్రధాన తారాగణంగా భమిడిపాటి వీర దర్శకత్వంలో రామ్ బి నిర్మిస్తున్న చిత్రం ‘నీ జతగా’. ఈ నెలాఖారుకి చిత్రాన్ని విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు భమిడిపాటి వీర మాట్లాడుతూ.. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కి చాలా మంచి స్పందన వచ్చింది. సాంగ్స్ అనంత శ్రీరామ్‌గారు రాయటంతో పాటు ఓ సాంగ్‌ను ఆయనే స్వయంగా విడుదల చేశారు. అందుకు ఆయనకి, చిత్రంలో ఓ పాట పాడిన అనురాగ్ కులకర్ణికి ధన్యవాదాలు అని తెలపగా.. నిర్మాత మాట్లాడుతూ.. అతి త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేయనున్నాం. ఇటీవల చిత్రాన్ని మా డిస్ట్రిబ్యూటర్స్‌కి చూపించటం జరిగింది. వారంతా సినిమాపై నమ్మకం వ్యక్తపరిచారు. ఈ నెలాఖరుకి సినిమాని రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం... అన్నారు. ప్రకృతి గురించి చాలా ఆహ్లాదకరమైన సాంగ్ రాసినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు గేయ రచయిత అనంత శ్రీరామ్.