Aryan Khan బెయిల్ పిటిషన్‌లో ఎన్సీబీ లాయర్ వాదనలివి

బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది. అతడి తరపున లాయర్ అమిత్ దేశాయ్ మొదట వాదనలు వినిపించారు. ఆ తర్వాత ఎన్సీబీ తరపున అడిషనల్ సోలిసిటరల్(ఎఎస్‌జీ) జనరల్ అనిల్ సింగ్ వాదనలు వినిపించారు. అయితే సమాయాభావం వల్ల విచారణను గురువారానికి వాయిదా వేశారు. ఈ కేసు విచారణ సందర్భంగా ఆయన చేసిన వాదనలివి. 

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అనంతరం అతడు బెయిల్ బెయిల్‌కు దరఖాస్తు చేసుకోగా మేజిస్ట్రేట్ కోర్టు అక్టోబర్ 8న ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. అనంతరం 14రోజుల జ్యూడిషియల్ కస్టడీ విధించింది. తాజాగా ఈ కేసు విచారణ అక్టోబర్ 13న ప్రత్యేక కోర్టు ముందుకు వచ్చింది. ఆర్యన్‌కు బెయిల్ ఇవ్వాలని అతణ్ని తరపున లాయర్ అమిత్ దేశాయ్ వాదించారు. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్  అనిల్ సింగ్ వాదనలు వినిసిస్తూ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించాలన్నారు.

ఎఎస్‌జీ వాదనలు వినిపిస్తూ.. ఈ కేసు ఒక వ్యక్తి, ఇద్దరికి సంబంధించినది కాదు. డ్రగ్ రాకెట్‌ను వెలికి తీయాలంటే కొంచెం సమయం కావాలి. ఎన్సీబీ అధికారులు ఎన్డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 29 కింద వీరిపై కేసును నమోదు చేశారు. అందువల్ల వీరందరికి డ్రగ్స్ సరఫరాదారులతో సంబంధాలున్నాయని ఎన్సీబీ అధికారులు వాదిస్తున్నారు.వాట్సాప్ చాట్‌లలో చాలా పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలను  వారు ప్రస్తావించారు. విదేశీయులతో కూడా సంభాషించారు. అందువల్ల కేసును లోతుగా దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉంది. ఒకరికి బెయిల్ ఇచ్చినా దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశముంటుంది. వారి దగ్గర ఎటువంటి మాదక ద్రవ్యాలు లభించలేదనడం సరికాదు. ఆర్యన్, అర్భాజ్ లకు గత 10ఏళ్లుగా పరిచయం ఉంది. అర్భాజ్ వద్ద 6గ్రాముల డ్రగ్స్ లభించాయి. వారి సొంత ఉపయోగానికే ఆ డ్రగ్స్ అని అధికారులు తెలుపుతున్నారు.

ఎఎస్‌జీ వాట్సప్ ఛాట్‌లను కోర్టుకు సమర్పిస్తూ వారిని కఠినంగా శిక్షించాలన్నారు.  ఈ కేసులో ఇప్పటి వరకు 20మందిని ఎన్సీబీ అధికారులు అరెస్టు చేయగా వీరిలో 4గురు డ్రగ్ సరఫరాదారులున్నారన్నారు. డ్రగ్స్ సరఫరా చేసేవారితో వీరికి సంబంధాలున్నాయని తెలిపారు. గత కొన్ని ఏళ్లుగా వీరు డ్రగ్స్ తీసుకుంటున్నట్లు ఆధారాలున్నాయని వివరించారు. అందువల్ల కేసును లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కొంత మంది విదేశీయులను అరెస్టు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖను కూడా సంప్రదిస్తామన్నారు. అనంతరం సమయాభావం వల్ల కేసు విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది

ఇవి కూడా చదవండిImage Caption

యాక్షన్ సీన్ల కోసం ఓ వ్యక్తి నుంచి సలహాలు తీసుకుంటున్న Shah Rukh Khan.. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరంటే..

Bollywoodమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.