NBK 108 : కథాంశంపై సోషల్ మీడియాలో కథనాలు !

ABN , First Publish Date - 2022-08-15T14:21:13+05:30 IST

నటసింహ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) గతేడాది ‘అఖండ’ (Akhanda) చిత్రంతో భారీ విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో ఓ ఫ్యాక్షన్ అండ్ యాక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. NBK 107 గా పిలుచుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతున్నట్టు తెలుస్తోంది.

NBK 108 : కథాంశంపై సోషల్ మీడియాలో కథనాలు !

నటసింహ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) గతేడాది ‘అఖండ’ (Akhanda) చిత్రంతో భారీ విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో ఓ ఫ్యాక్షన్ అండ్ యాక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. NBK 107 గా పిలుచుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతున్నట్టు తెలుస్తోంది. ఇంతకు ముందు విడుదలైన ఈ సినిమా టీజర్, అందులోని బాలయ్య డైలాగ్స్ చిత్రంపై భారీ అంచనాల్ని నెలకొల్పాయి. ఇదిలా ఉంటే.. బాలకృష్ణ 108వ చిత్రం అధికారిక ప్రకటన కూడా ఇటీవలే వెలువడిన సంగతి తెలిసిందే. కామెడీ ఎంటర్‌టైనర్స్ స్పెషలిస్ట్ అనిల్ రావిపూడి ఈ సినిమాకి దర్శకుడు.


‘పటాస్’ (Patas) నుంచి లేటెస్ట్ ‘ఎఫ్ 3’ (F3) చిత్రాల వరకూ సూపర్ హిట్స్ ఖాతాలో వేసుకొని టాలీవుడ్ అజేయ దర్శకుల్లో ఒకరిగా ప్రత్యేకతను చాటుకుంటున్న అనిల్.. బాలయ్యతో ఏ తరహా చిత్రం తీయబోతున్నారనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా కథాంశం ఇదేనంటూ సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. దాని ప్రకారం ఈ సినిమా కథ ఏంటంటే.. 30 ఏళ్ళ వయసులో ఆవేశంతో చేసిన గొడవల కారణంగా హీరోకి 14 ఏళ్ళ శిక్ష పడుతుందట. జైలు నుంచి విడుదలైన హీరో జీవితంలో చోటు చేసుకొనే సంఘటనలు చాలా కామెడీగా సాగుతాయని, సినిమాలో రొమాంటిక్ ట్రాక్ కూడా పూర్తిగా వినోదం పంచుతుందని తెలుస్తోంది. ఇక ఇందులో బాలయ్య ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయితే చాలా వైల్డ్‌గా ఉంటుందట. 


మాస్ యాక్షన్ చిత్రాలు చేయడంలో చెయితిరిగిన బాలయ్య, కామెడీ ఎంటర్‌టైనర్స్‌ తీయడంలో దిట్టైన అనిల్ రావిపూడి కలయికలో రాబోయే సినిమా నిజంగానే ఇదే కథాంశంతో తెరకెక్కితే మాత్రం అభిమానులకు పండగే. బాలయ్యలోని కామెడీ టైమింగ్‌ను చూసి చాలా కాలమైపోయింది. NBK 108తో ఆయనకి మళ్ళీ ఆ అవకాశం రావడం విశేషమనే చెప్పాలి. వచ్చేనెల్లోనే సెట్స్ పైకి వెళ్ళబోతున్న ఈ సినిమాకి ఎలాంటి టైటిల్ ఖాయం చేస్తారో చూడాలి. 

Updated Date - 2022-08-15T14:21:13+05:30 IST