సినిమా రివ్యూ: ‘నయీం డైరీస్’
ABN , First Publish Date - 2021-12-10T21:58:04+05:30 IST
నేర చరిత్రలో నయీమ్ కంటూ ఓ ప్రత్యేక పేజీ ఉంటుంది. ఆ పేజీలో తెలియని విషయం చాలా ఉందని, అదేమిటో చెప్పేందుకు ‘నయీం డైరీస్’ చిత్రాన్ని తెరకెక్కించినట్లుగా దర్శకుడు దాము బాలాజీ ఇప్పటి వరకు చెబుతూ వచ్చారు. సంచలన దర్శకుడు వర్మ చేయాలనుకున్న చిత్రమిదని కూడా ఆయన తెలిపారు. ‘కెజియఫ్’, ‘నారప్ప’ వంటి చిత్రాలతో విభిన్నమైన నటుడిగా పేరు తెచ్చుకున్న వశిష్ట సింహను ప్రధాన పాత్రకు తీసుకుని, ఎన్ని బెదిరింపులు వచ్చినా లెక్కచేయకుండా.. ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లుగా దర్శకుడు చెప్పడంతో.. సహజంగానే ఈ సినిమాపై అంచనాలు మొదలయ్యాయి. అలాగే విడుదలకు ముందే చుట్టుముట్టిన వివాదాలు కూడా ఈ సినిమాని వార్తలో ఉండేలా చేశాయి. మరి అన్నింటిని ఎదుర్కొని నేడు థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. కథ: భువనగిరిలోని ఒక సాధారణ కుటుంబానికి చెందిన నయీమ్‌కు చిన్నతనం నుండే కుటుంబం పట్ల బాధ్యత.. ఏదైనా సరే గెలిచి తీరాలనే పట్టుదల ఉంటాయి. అక్క(యజ్ఞా శెట్టి)ని ఎవరు ఏమన్నా వారిని వదిలిపెట్టడు. అతని ధైర్య సాహాసాలు చూసి మావోలు అతనిని నక్సలిజంలోకి తీసుకెళ్తారు. అక్కడ ఎదిగిన నయీం ఒక ఐజీ హత్

విశ్లేషణ: