ఇన్వెస్టర్‌గా మారిన నయనతార.. ఆ కంపెనీలో కోట్లల్లో పెట్టుబడి..!
ABN , First Publish Date - 2022-01-14T22:05:17+05:30 IST
అందం, అభినయంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్న నటి నయనతార. కొత్త రకం పాత్రలకు ఆమె కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది

అందం, అభినయంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్న నటి నయనతార. కొత్త రకం పాత్రలకు ఆమె కేరాఫ్ అడ్రస్‌గా మారింది. టాలీవుడ్‌తో పాటు, కోలీవుడ్‌లోను విభిన్న రకాల చిత్రాల్లో నటిస్తుంది. ఆమె కొత్త బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చినట్టు తెలుస్తోంది. దుబాయ్‌కి చెందిన ఒక కంపెనీలో పెట్టుబడి పెట్టినట్టు కోలీవుడ్ మీడియా చెబుతోంది. ఆయిల్ కంపెనీలో దాదాపుగా రూ. 100కోట్లను ఇన్వెస్ట్ చేసినట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. నయనతార, విఘ్నేశ్ శివన్ గత కొంత కాలంగా డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ జంట కొత్త ఏడాది వేడుకలను దుబాయ్‌లో జరుపుకొన్నారు. బిజినెస్ పని మీదే వీరు దుబాయ్ వెళ్లి అక్కడే నూతన సంవత్సరాన్ని జరుపుకొన్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
నయనతార, విఘ్నేశ్ శివన్ కలిసి రౌడీ పిక్చర్స్ నిర్మాణ సంస్థను స్థాపించారు. ఆ బ్యానర్‌పై సినిమాలను కూడా నిర్మిస్తున్నారు. ఆ బ్యానర్‌లో ‘‘ కూళంగల్ ’’ అనే చిత్రాన్ని నిర్మించారు. గతంలోనే చెన్నైకి చెందిన ‘‘ చాయ్‌వాలే’’ బేవరేజ్ బ్రాండ్‌లో నయనతార, విఘ్నేశ్ శివన్ ఇన్వెస్ట్ చేశారు. నయనతార ‘‘ లిప్ బామ్ ’’ అనే బ్యూటీ రిటైల్ బ్రాండ్‌ను కూడా లాంచ్ చేసింది. నయన్ ప్రస్తుతం ‘‘ కాత్తువక్కుల రెండు కాదల్ ’’, ‘‘ కనెక్ట్ ’’, ‘‘ గాడ్ ఫాదర్ ’’, ‘‘ లయన్ ’’ వంటి చిత్రాల్లో నటిస్తోంది.
చెన్నైలోని పోయెస్ గార్డెన్‌లో ఆమె కొత్త ఇంటిని కొనుగోలు చేసింది. ఆ ప్రాంతంలో 4 బీహెచ్‌కే ఫ్లాట్‌ను కొనుగోలు చేసినట్టు కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. చెన్నైలోని విలాసవంతమైన ప్రదేశాల్లో పోయెస్‌గార్డెన్ ఒకటి. తమిళనాడు దివంగంత ముఖ్యమంత్రి జయలలిత, రజినీకాంత్ తదితరుల నివాసాలు కూడా ఇక్కడే ఉన్నాయి. నయనతార, విఘ్నేశ్ శివన్‌తో కలిసి ఆ ఇంటిలొనే ఉండబోతున్నట్టు తెలుస్తోంది.