దక్షిణాదిన అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ ఎవరంటే ఠక్కున వినిపించే పేరు నయనతార. దక్షిణాది నుంచి ఎందరో హీరోయిన్స్ బాలీవుడ్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుని వెనక్కి వచ్చినవాళ్లే. మరి నయనతార బాలీవుడ్ ఎంట్రీ ఇప్పుడు ఇస్తుందా? అని ఆమె అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే వీరి ఎదురు చూపులు ఫలించనున్నాయని, నయనతార బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వనుందని వార్తలు వినిపిస్తున్నాయి. వివరాల మేరకు, బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ హీరోగా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నయనతారను హీరోయిన్గా తీసుకోవాలని అట్లీ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ వార్తలపై ఓ క్లారిటీ రానుంది. జీరో తర్వాత షారూక్ మరో సినిమాలో నటించలేదు. చాలా గ్యాప్ తర్వాత ‘పఠాన్’ సినిమాను స్టార్ట్ చేసిన షారూక్ ఈసారి ఎక్కువ గ్యాప్ లేకుండా అట్లీ సినిమాతో పాటు రాజ్ కుమార్ హిరాణీ సినిమాను కూడా ట్రాక్ ఎక్కించనున్నారు.