Nayanathara : పారితోషికం అంత పెంచేసిందా?

Twitter IconWatsapp IconFacebook Icon
Nayanathara : పారితోషికం అంత పెంచేసిందా?

దక్షిణాది ప్రేక్షకులు లేడీ సూపర్ స్టార్‌ అని పిలుచుకొనే ఒకే ఒక అందాల సుందరి నయనతార (Nayanathara). దాదాపు అన్ని భాషల్లోనూ అగ్రకథానాయకులతోనూ, మిడిల్ రేంజ్ హీరోలతోనూ జోడీ కట్టిన ఈ బ్యూటీ.. ఇప్పటికీ క్రేజీ స్టార్‌డమ్‌ను కొనసాగిస్తూండడం ఆశ్చర్యమనిపించకమానదు. తమిళ, తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో సైతం పలు చిత్రాల్లో నటిస్తూ అభిమానుల్ని అలరిస్తోంది. ఇటీవల నయన్.. తన బాయ్ ఫ్రెండ్, తమిళ దర్శక నిర్మాత అయిన విఘ్నేష్ శివన్‌ (Vighnesh Shivan) ను పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్ళి తర్వాత అమ్మడు సినిమాలకు గుబ్ బై చెప్పేస్తుందని ఆందోళన చెందారు అభిమానులు. అయితే తన కమిట్‌మెంట్స్ ను పూర్తి చేయడానికి ఆమె ఇటీవల రంగంలోకి దిగడం వారికి ఊరట కలిగించే అంశమే. 

అసలు విషయానికొస్తే నయనతార తన పారితోషికాన్ని ఓ రేంజ్‌లో పెంచేసినట్టు కోలీవుడ్ మీడియానుంచి వార్తలందుతున్నాయి. పెళ్ళి తర్వాత ఆమె మరింత ఉత్సాహంగా వైవిధ్యమైన కథాంశాల్ని ఎంపిక చేసుకోవడమే కాకుండా.. పారితోషికాన్ని కూడా పెంచేయడం హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ (Sharukh Khan) ‘జవాన్’ (Jawan) అనే మూవీలో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం నయన్.. ఏకంగా రూ. 7 కోట్లు పారితోషికం అందుకున్నట్టు వినికిడి. అయితే ఆమె తదుపరిగా నటించే ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ కోసం ఏకంగా రూ. 10 కోట్లు డిమాండ్ చేసినట్టు వార్తలొస్తున్నాయి. ఆమె అడిగిన అమౌంట్ ఎక్కువైనప్పటికీ.. ఆమె క్రేజ్ వల్ల నిర్మాతలు బేరసారాలేమీ సాగించకుండా దానికి అంగీకారం తెలిపారట. అది నయనతార 75వ చిత్రం అవడం కూడా దానికి ఓ కారణమని చెప్పాలి. 

ప‌ృధ్విరాజ్ సుకుమారన్ (Prithwiraj Sukumaran) హీరోగా ‘గోల్డ్’ (Gold) మలయాళ చిత్రంలోనూ, ‘ఇరైవన్ (Iraivan), ‘కనెక్ట్’ (Connect)’ తమిళ సినిమాల్లోనూ, మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ‘గాడ్‌ఫాదర్’ (Godfather) చిత్రంలోనూ, తన 75వ చిత్రంలోనూ నయనతార నటిస్తోంది. ఈ సినిమాలన్నీ ఈ ఏడాదిలోనే విడుదల కాబోతున్నాయి. వీటిలో ‘కనెక్ట్’ అనే మూవీకి ప్రొడ్యూసర్‌గానూ వ్యవహరిస్తోంది నయనతార. మరి ఈ సినిమాలన్నీ సూపర్ హిట్టైతే నయన్ ఇంకెంతగా తన పారితోషికాన్ని పెంచుతుందో చూడాలి.   

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.