‘గుడ్ లక్ జాన్వీ’ (Good luck janhvi) అంటూ దివంగత నటి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌కు (janhvi Kapoor)విషెస్ చెప్పారు నయనతార(Nayana tara). ఆమె కథానాయికగా నటించిన ‘కొలమావు కోకిల’ చిత్రాన్ని హిందీలో ‘గుడ్ లక్ జెర్రీ’ టైటిల్‌తో రీమేక్ చేశారు. జూలై 29న ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో జాన్వీ నటనకు ప్రేక్షకులే కాకుండా సినీ సెలబ్రిటీలు సైతం ప్రశంసిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను వీక్షించిన నయన్ పలు ఇంటర్వ్యూలో జాన్వీని ప్రశంసించారు. ఈ విషయం తెలుసుకున్న జాన్వీ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నయన్‌కు థ్యాంక్ప్ చెప్పారు. లేడీ సూపర్‌స్టార్ ప్రశంసించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. (Lady superstar nayanatara)
జాన్వీ మాట్లాడుతూ ‘‘గుడ్ లక్ జాన్వీ’ (Good luck janhvi)ట్రైలర్‌పై నయన్ గొప్పగా మాట్లాడారని తెలుసుకున్నా. నా నటన గురించి ఆమె నోట వినడం చాలా సంతోషంగా అనిపించింది. అందుకే ఆమెతో స్వయంగా మాట్లాడి కృతజ్ఞతలు తెలపాలని ఆమె ఫోన్ నంబర్ తీసుకుని మెేసజ్ చేశా. వెంటనే ఆమె నుంచి రిప్లై వచ్చింది. ‘కెరీర్ బిగినింగ్‌లోనే నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు పోషించినందుకు గర్వపడుతున్నా. ‘గుడ్ లక్ జెర్రీ’ ట్రెలర్ నాకు చాలా నచ్చింది. కోకిల నా మనసుకు చాలా దగ్గరైన పాత్ర. ప్రేక్షకులకు చక్కని వినోదాన్ని పంచావు. ‘గుడ్ లక్ జాన్వీ’ అంటూ నయన్ మెేసజ్ చేశారు’’ అని జాన్వీ కపూర్ ఆనందం వ్యక్తం చేశారు. జాన్వీ నటించిన ‘మిలీ’ తదితర చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు త్వరలో జాన్వీ టాలీవుడ్‌కి కూడా రాబోతుందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి.