ఇటు తమిళం, అటు తెలుగు చిత్రపరిశ్రమలో అగ్ర హీరోయిన్గా కొనసాగుతున్న హీరోయిన్లలో ఒకరు నయనతార. ఈమె ఎన్ని వివాదాల్లో చిక్కుకున్నప్పటికీ సినీ కెరీర్‌కు మాత్రం ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకుసాగిపోతోంది. నయనతార రెండు సార్లు ప్రేమలో విఫలమైంది. అయినప్పటికీ ఆమె సినీ కెరీర్‌కు ఎక్కడా ఎలాంటి బ్రేక్ పడలేదు. ఇపుడు కోలీవుడ్ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతోంది. ఈ ప్రేమజంట తమ పుట్టినరోజు వేడుకలతో పాటు తమతమ ఇళ్ళలో జరిగే శుభకార్యాలకు ప్రైవేట్ జెట్లలో వెళ్ళి వస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలో ఇటీవల కూడా ఈ జంట చెన్నై నుంచి కొచ్చిన్‌కు ప్రత్యేక జెట్‌లో వెళ్ళి వచ్చింది. ఈ టూర్‌కు సంబంధించిన వార్త ఒకటి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. నయనతార తండ్రికి అనారోగ్యం చేయడంతో హుటాహుటిన కొచ్చిన్‌కు వెళ్ళినట్టు తెలిసింది. అంతేకాకుండా తన కుమార్తెను పెళ్లి దుస్తుల్లో చూడాలని నయనతార తండ్రి ఎప్పటి నుంచో భావిస్తున్నారు. దీన్ని నయనతార పోస్ట్‌పోన్ చేస్తూ వస్తోంది. అయితే, ఇప్పుడు అనారోగ్యం బారినపడటంతో తండ్రి మాట కాదనలేక... పెళ్ళి చేసుకునేందుకు సరేననంట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం. అయితే, ఈ పెళ్ళి ఎప్పుడు, ఎక్కడ.. తదితర అంశాలపై త్వరలోనే నయనతార - విఘ్నేష్ శివన్‌లు అధికారికంగా వెల్లడించే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.