థ్యాంక్స్ తంగమై
ABN , First Publish Date - 2021-09-20T12:38:18+05:30 IST
తన ప్రియుడు, కాబోయే భర్త విఘ్నేష్ శివన్‌ను నయనతార సర్ర్పైజ్ చేశారు. శనివారం విఘ్నేష్ 36వ పుట్టిన రోజును ఆమె గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు...

తన ప్రియుడు, కాబోయే భర్త విఘ్నేష్ శివన్‌ను నయనతార సర్ర్పైజ్ చేశారు. శనివారం విఘ్నేష్ 36వ పుట్టిన రోజును ఆమె గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. విఘ్నేష్ స్నేహితులను నయన్ ఈ పార్టీకి ఆహ్వానించారు. పుట్టిన రోజు వేడుకలకు సంబంఽధించిన ఫొటోలను విఘ్నేష్ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరలయ్యాయి. తమ ఇద్దరికీ నిశ్చితార్థం జరిగినట్టు నయనతార ఇటీవలె వెల్లడించిన విషయం తెలిసిందే. ‘సినిమా చిత్రీకరణలతో తీరిక లేకుండా ఉన్నా నా కోసం సమయం కేటాయించి, అందమైన బహుమతి ఇచ్చినందుకు థ్యాంక్స్ తంగమై. నా జీవితంలో నిన్ను మించిన బహుమతి లేదు’ అని విఘ్నేశ్ భావోద్వేగంతో ట్వీట్ చేశారు. విజయ్ సేతుపతి సరసన ‘కాథు వాకల రెండు కాదల్’ చిత్రంలో నయనతార నటిస్తున్నారు. ఈ సినిమాకు విఘ్నేష్ శివన్ దర్శకుడు.