నవీన్‌ పోలిశెట్టి: ‘అనగనగా ఒక రాజు’

ABN , First Publish Date - 2022-01-16T23:23:24+05:30 IST

నవీన్‌ పోలిశెట్టి హీరోగా ‘సితార ఎంటర్‌ టైన్మెంట్స్‌’, ఫార్చ్యూన్‌ 4 సినిమాస్‌’ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘అనగనగా ఒకరాజు’. కళ్యాణ్‌ శంకర్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం టైటిల్‌ టీజర్‌ను విడుదల చేశారు. రాజుగాడి పెళ్లి పేరుతో టీజర్‌లో నవీన్‌ చేసిన హంగామా అలరిస్తుంది.

నవీన్‌ పోలిశెట్టి: ‘అనగనగా ఒక రాజు’

నవీన్‌ పోలిశెట్టి హీరోగా ‘సితార ఎంటర్‌ టైన్మెంట్స్‌’, ఫార్చ్యూన్‌ 4 సినిమాస్‌’ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘అనగనగా ఒకరాజు’. కళ్యాణ్‌ శంకర్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం టైటిల్‌ టీజర్‌ను విడుదల చేశారు. రాజుగాడి పెళ్లి పేరుతో టీజర్‌లో నవీన్‌ చేసిన హంగామా అలరిస్తుంది.


‘ఇదిగో ఇలా..’ 

నాయుడుగారు హనీమూన్‌కి హవాయికి టికెట్స్‌ బుక్‌ చేశారా లేదా...డబ్బులు గురించి ఆలోచించకండి? రాజు గాడి పెళ్లి ఇక్కడ!

పారిజాతం అత్తయ్యా.. 

రేయ్‌ అత్తయ్య గారు వచ్చారు ఏసీ ఆన్‌ చేయండ్రా అంటూ తన బంగారాన్ని చూపిస్తూ స్టయిల్‌ కొడుతూ ఉంటాడు! 

ఇదేం విడ్డూరం ఆడవాళ్లకేన వడ్డాణం... అందుకే నేను కూడా మామకు చెప్పి డబ్ల్యుడబ్ల్యుయఫ్‌ లాంటింది  ఐదు కిలోల బంగారం చేయించాను. 

మన ఫోటోలు చూసి ఆ కత్రినా కైఫ్‌, విక్కి కౌషల్‌ కుళ్లుకుని చావాలి.. అలా తియ్యి నువ్వు. దీనికి రాజు ఈటింగ్‌  కాజు అని కాప్షన్‌ ఏసుకోరా...! అంటూ నవీన్‌ పోలిశెట్టి పలికిన డైలాగ్‌లు ఆద్యంతం అలరించేలా ఉన్నాయి. 


‘‘ప్రేక్షకులంతా సరదాగా నవ్వుకోవడానికి సిద్ధంకండి. మేము వినోదాన్ని పంచడానికి సిద్థమవుతున్నాము’’ అంటున్నారు మేకర్స్‌. త్వరలో ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభః కానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. పి.డి.వి ప్రసాద్‌ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సూర్య దేవర నాగవంశీ, శ్రీమతి సాయి సౌజన్య నిర్మాతలు. 




Updated Date - 2022-01-16T23:23:24+05:30 IST