'సభకు నమస్కారం'లో నవీన్ చంద్ర

ABN , First Publish Date - 2021-07-22T16:09:28+05:30 IST

అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'సభకు నమస్కారం'. ఈ మూవీలో మరో హీరోకి అవకాశం ఉండగా, ఆ పాత్రలో నవీన్ చంద్ర కనిపించబోతున్నాడట. ఇటీవల 'నాంది' సినిమాతో హిట్ అందుకున్న అల్లరి నరేష్ 'సభకు నమస్కారం'లో నటిస్తున్నాడు. ఈ సినిమా అల్లరి నరేష్ కెరీర్లో 58వ చిత్రంగా రూపొందుతోంది.

'సభకు నమస్కారం'లో నవీన్ చంద్ర

అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'సభకు నమస్కారం'. ఈ మూవీలో మరో హీరోకి అవకాశం ఉండగా, ఆ పాత్రలో నవీన్ చంద్ర కనిపించబోతున్నాడట. ఇటీవల 'నాంది' సినిమాతో హిట్ అందుకున్న అల్లరి నరేష్ 'సభకు నమస్కారం'లో నటిస్తున్నాడు. ఈ సినిమా అల్లరి నరేష్ కెరీర్లో 58వ చిత్రంగా రూపొందుతోంది. సెటైరికల్ పొలిటికల్ థ్రిల్లర్‌గా సతీష్ మల్లంపాటి దీనిని తెరకెక్కిస్తున్నాడు. మహేష్ ఎస్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఇప్పటికే విడుదల చేసిన అల్లరి నరేష్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కాగా టాలెంటెడ్ హీరో నవీన్ చంద్ర ఇందులో నెగిటివ్ రోల్ చేయబోతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలపై చిత్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Updated Date - 2021-07-22T16:09:28+05:30 IST