నవరసాలు.. 9 లుక్స్‌

నవరసాల కథాంశంతో 9 భాగాలుగా తమిళంలో రూపొందుతున్న వెబ్‌సిరీస్‌ ‘నవరస’. 9 మంది దర్శకులు తెరకెక్కిస్తున్న ఈ వెబ్‌సిరీ్‌సలో ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. దర్శకుడు మణిరత్నం నిర్మాత పంచపకేషన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ వెబ్‌సిరీస్‌ ఆగస్టు9న నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో విడుదలకానుంది. ఈ నేపథ్యంలో ‘నవరస’ నుంచి 9 భాగాలకు సంబంధించిన ఫస్ట్‌లుక్స్‌ను విడుదల చేశారు. గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌, ప్రియదర్శన్‌, అరవింద్‌స్వామి బెజోయ్‌ నంబియార్‌, కార్తిక్‌ సుబ్బరాజ్‌, కార్తిక్‌ నరేన్‌ తదితరులు దర్శకత్వం వహించారు. సూర్య, యోగిబాబు, విజయ్‌ సేతుపతి, ప్రకాశ్‌రాజ్‌, అథర్వ, అంజలి, సిద్ధార్థ్‌, అరవింద్‌స్వామి, బాబీసింహ ప్రధాన పాత్రలు పోషించారు.


అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.