గే ఆర్మీ అధికారి పాత్రతో స్క్రిఫ్ట్ రెడీ.. ఎన్‌వోసీ కోసం రక్షణ శాఖకు దరఖాస్తు చేస్తే..

ABN , First Publish Date - 2022-01-22T21:30:45+05:30 IST

సినిమా అంటేనే సృజనాత్మకతకు మారు పేరు. కానీ, ఆ సృజనాత్మకతకు ప్రభుత్వం అడ్డంకులు కల్పిస్తోందని ఫిల్మ్ మేకర్ ఒనిర్ అంటున్నాడు

గే ఆర్మీ అధికారి పాత్రతో స్క్రిఫ్ట్ రెడీ.. ఎన్‌వోసీ కోసం రక్షణ శాఖకు దరఖాస్తు చేస్తే..

సినిమా అంటేనే సృజనాత్మకతకు మారు పేరు. కానీ, ఆ సృజనాత్మకతకు ప్రభుత్వం అడ్డంకులు కల్పిస్తోందని ఫిల్మ్ మేకర్ ఒనిర్ అంటున్నాడు. గతంలో అతడు దర్శకత్వం వహించిన చిత్రం ‘ఐ యామ్’. ఈ సినిమాకు అతడు జాతీయ అవార్డు గెలుచుకున్నాడు. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ రూపొందించాలనుకున్నాడు. ‘వి ఆర్’ అని టైటిట్ పెట్టాడు. ‘వి ఆర్’ స్క్రిఫ్ట్‌‌ను మేజర్ జే. సురేష్ అనే గే ఆర్మీ అధికారి పాత్రతో స్ఫూర్తి పొందాడు. ఆ స్క్రిఫ్ట్‌కు ఎన్‌వోసీ(నో అబ్జెక్షన్ సర్టిఫికేట్) జారీ చేయమని అడగగా రక్షణ మంత్రిత్వ శాఖ ఇవ్వలేదని వాపోతున్నాడు. 


ఒనిర్ తాజాగా మీడియాతో మాట్లాడాడు..‘‘ప్రభుత్వం ఒక కొత్త చట్టం రూపొందించింది. ఆ చట్టం ప్రకారం సెక్యూరిటీ ఫోర్సెస్‌కు చెందిన వారిపై సినిమా తీయాలంటే తప్పకుండా సర్కారు నుంచి ఎన్‌వోసీ పొందాలి. ఎన్‌వోసీ‌ని పొందలేకపోతే ఆ చిత్రానికి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వరు. గత ఏడాది డిసెంబర్ 16న స్క్రిఫ్ట్‌ను అటాచ్ చేస్తూ నేను ఎన్‌వోసీ‌కి అప్లై చేశాను. ఎవరినీ కించపరచాలనే ఉద్దేశంతో ఆ స్క్రిఫ్ట్ రాయలేదు. భారత ఆర్మీపై నాకు గౌరవం ఉంది’’ అని ఒనిర్ చెప్పుకొచ్చాడు. 


అయితే, ఆ స్క్రిఫ్ట్‌ను రిజెక్ట్ చేస్తూ భారత ఆర్మీ నుంచి తనకు ఇమెయిల్ వచ్చిందని అతడు వెల్లడించాడు. తను ప్రభుత్వాన్ని వివరణ అడగగా స్పందించలేదని చెప్పాడు. ‘‘స్క్రిఫ్ట్‌లో ఎటువంటి సమస్య లేదు కాబట్టి  ప్రభుత్వం రాత పూర్వకంగా సమాధానం పంపించలేదు. ఆర్మీ అధికారిని గే పాత్రలో చూపించడంతోనే ఆ స్క్రిఫ్ట్‌ను తోసి పుచ్చారు’’ అని ఒనిర్ స్పష్టం చేశాడు. 


Updated Date - 2022-01-22T21:30:45+05:30 IST