ప్రముఖ బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా న్యుమోనియాతో బాధపడుతూ ముంబైలోని ఆసుపత్రిలో చేరారు. చికిత్సకు బాగానే స్పందిస్తున్నారని ఆయన మేనేజర్ మీడియాకు వెల్లడించారు. నసీరుద్దీన్ భార్య, కుమారుడు వివాన్ సహా కుటుంబమంతా ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని ఆయన తెలిపారు. గత రెండురోజులుగా న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన్ను మంగళవారం హాస్పిటల్లో చేర్పించామని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగుందని నసీరుద్దీన్ భార్య రత్నా పథక్ తెలిపారు.