నరేశ్‌ వార్నింగ్‌: విష్ణుని డిస్టర్బ్‌ చేస్తే బాగోదు..

ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా విమర్శలెందుకు? 

మోదీ గెలిచారని కాంగ్రెస్‌ వాళ్లు దేశం విడిచి వెళ్లిపోతారా?

‘మా’ ఒక సేవా సంస్థ..  రాజీనామా చేయాల్సిన అవసరం లేదు

అందరూ కలిసి పనిచేయాలి..  ‘మా’లో పెత్తందారీ వ్యవస్థ పోవాలి

ఇకపై ‘మా’లో ఎన్నికలే ఉండకూడదు.. ఏకగ్రీవాలే ఉండాలి

మంచు విష్ణుకి ‘మా’ అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన అనంతరం నరేశ్‌ చేసిన వ్యాఖ్యలివి.

 

‘‘ఓడినా, గెలిచినా కలసి పనిచేస్తాం అన్నారు. ఇప్పుడేమైంది? బయటి నుంచి ప్రశ్నించడం ఏంటి? ‘మా’ అనేది కుటుంబం. రిజైన్‌ చేసిన ఈసీ మెంబర్స్‌ గురించి కొత్త ప్యానల్‌ చూసుకుంటుంది. విష్ణుని ఎవరైనా డిస్టర్బ్‌ చేేస్త బాగోదు. ప్రశాంతంగా అతన్ని పని చేసుకోనివ్వండి’ అని అన్నారు నరేశ్‌. ‘మా’  ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలను నరేశ్‌  ఖండించారు. కొంత మంది మగవాళ్లు ఏడ్వడం చూశాను అంటూ పరోక్షంగా బెనర్జీ, ఉత్తేజ్‌లపై దారుణమైన కామెంట్స్‌ చేశారు. ‘ఇప్పటికీ పిలుస్తున్నాం. కలిసి పని చేద్దాం రండి’ అని నరేష్‌ అన్నారు. 


‘మా’ ఎన్నికల నేపథ్యంలో మంచు విష్ణు ప్యానల్‌ గెలవడానికి కీలకంగా కష్టపడింది నరేశ్‌ మాత్రమే అని అందరూ భావిస్తున్నారు. ఈ మేరకు ఎన్నికల ఫలితాలు వెలువడగానే నరేశ్‌.. కృష్ణుడిలా వెనకుండి మొత్తం నడిపించి విష్ణు ప్యానల్‌ను గెలిపించినట్లు కృష్ణుడి అవతారంలో విడుదల చేసిన విషెస్‌ ప్రొమో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 


అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.