‘నారప్ప‌’.. అప్‌డేట్‌ వచ్చేసింది

విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'నార‌ప్ప‌'. సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జాతీయ ఉత్తమ నటి ప్రియమణి ఈ మూవీలో నార‌ప్ప భార్య 'సుందరమ్మ'గా నటించారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌ గ్లిమ్స్‌, పోస్టర్స్‌తో పాటు ‌విక్ట‌రీ వెంక‌టేష్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రిలీజైన `నార‌ప్ప` టీజ‌ర్‌ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని U/A సర్టిఫికెట్ పొందింది. ఈ క్రమంలో ఈ చిత్రం ఓటీటీలో విడుదల కాబోతుందంటూ వార్తలు రావడం, వాటిని చిత్రయూనిట్‌ ఖండించడం వంటి విషయాలు తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ని చిత్రయూనిట్‌ ప్రకటించింది. ఈ చిత్రంలోని 'చలాకి చిన్నమ్మీ..' అనే ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను జూలై 11 ఉదయం 10గంటలకు విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ.. చిత్రయూనిట్‌ ఓ పోస్టర్‌ని విడుదల చేసింది.


అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.