Nani: నాని స్పెష‌ల్ ట్రైనింగ్‌.. దేనికోస‌మో తెలుసా?

ABN , First Publish Date - 2021-07-27T21:26:57+05:30 IST

నేచుర‌ల్ స్టార్ నాని ఓ విష‌యంపై ప‌ట్టు సాధించ‌డానికి స్పెష‌ల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం. ఇంత‌కీ నాని ఏ విష‌యంలో ప‌ట్టు కోసం ప్ర‌య‌త్నిస్తున్నాడో తెలుసా!..

Nani: నాని స్పెష‌ల్ ట్రైనింగ్‌.. దేనికోస‌మో తెలుసా?

నేచుర‌ల్ స్టార్ నాని ఓ విష‌యంపై ప‌ట్టు సాధించ‌డానికి స్పెష‌ల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం. ఇంత‌కీ నాని ఏ విష‌యంలో ప‌ట్టు కోసం ప్ర‌య‌త్నిస్తున్నాడో తెలుసా!.. తెలంగాణ యాస‌పై ప‌ట్టుకోసం. సుధాకర్ చెరుకూరి నిర్మాతగా శ్రీకాంత్ అనే కొత్త దర్శకుడితో నాని సినిమా చేయబోతున్నాడు. ఇందులో నాని తెలంగాణ యువ‌కుడిగా క‌నిపించ‌బోతున్నాడు. ఆ పాత్ర కోసం నాని ఓ ట్యూట‌ర్‌ను పెట్టుకుని యాస నేర్చుకుంటున్న‌ట్టు స‌మాచారం. రీసెంట్‌గానే ‘శ్యామ్ సింగ‌రాయ్’ సినిమాను పూర్తి చేసిన నాని, ఇప్పుడు ‘అంటే సుంద‌రానికీ’ సినిమా చిత్రీక‌ర‌ణ‌తో బిజీగా ఉన్నాడు. దీని త‌ర్వాతే శ్రీకాంత్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచ‌న‌లో ఉన్నాడు నాని. 

Updated Date - 2021-07-27T21:26:57+05:30 IST