Nani ‘దసరా’.. దసరాకి వస్తుందా?

ABN , First Publish Date - 2022-06-12T19:23:29+05:30 IST

నేచురల్ స్టా్ర్ నానీ (Nani).. ఇటీవల ‘అంటే సుందరానికీ’ (Ante Sundaraniki) అనే కామెడీ ఎంటర్ టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మంచి టాక్ రావడంతో చిత్రం విజయవంతంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో తదుపరిగా నానీ నటిస్తున్న చిత్రంపై మరింత ఆసక్తినెలకొంది.

Nani ‘దసరా’.. దసరాకి వస్తుందా?

నేచురల్ స్టా్ర్ నానీ (Nani).. ఇటీవల ‘అంటే సుందరానికీ’ (Ante Sundaraniki) అనే కామెడీ ఎంటర్ టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.  మంచి టాక్ రావడంతో చిత్రం విజయవంతంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో తదుపరిగా నానీ నటిస్తున్న చిత్రంపై మరింత ఆసక్తినెలకొంది. ఓదెల శ్రీకాంత్ (Odela Srikanth) అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ‘దసరా’ (Dasara) చిత్రంలో నానీ వెరైటీ పాత్ర పోషిస్తున్నాడు. సినిమాను ప్రకటించిన రోజున విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ లో నానీ మేకోవర్ అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. నానీ తన కెరీర్ లోనే పక్కా మాస్ గెటప్ లో కనిపించబోతున్నాడు. సింగరేణి బొగ్గుగనుల నేపథ్యంలో ఆసక్తికరమైన కథాకథనాలతో ఈ సినిమా రూపొందుతోంది. ఇక ఇందులో నానీ సరసన మల్లూ బ్యూటీ కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తోంది. 


నిజానికి ‘దసరా’ సినిమాను టైటిల్ కు తగ్గట్టుగానే  ఈ ఏడాది దసరా కానుకగా విడుదల చేయాలనుకున్నారు మేకర్స్. అయితే ప్రస్తుతం షూటింగ్ నెమ్మదిగా సాగుతుండడంతో నానీ ప్లాన్ మారిందని టాక్. తాజా సమాచారం ప్రకారం ‘దసరా’ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా విడుదల చేయబోతున్నారట. గతేడాది క్రిస్మస్ సీజన్ లో వచ్చిన ‘శ్యామ్ సింగరాయ్’  (Shyam Singharoy) సినిమా ఏ స్థాయిలో హిట్ అయ్యిందో తెలిసిందే. ‘నేను లోకల్’ (Nenu Local) తర్వాత నానీ, కీర్తి సురేశ్ కలయికలో వస్తున్న మరో సినిమా కావడంతో ‘దసరా’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.  మరి ఈ సినిమా నానీకి ఏ స్థాయిలో సక్సెస్ అందిస్తుందో చూడాలి.  

Updated Date - 2022-06-12T19:23:29+05:30 IST