Nani - Shyam Singha Roy: నాని.. ‘శ్యామ్ సింగరాయ్’ షూటింగ్ పూర్తి

ABN , First Publish Date - 2021-07-26T16:14:54+05:30 IST

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ‘శ్యామ్ సింగరాయ్’ షూటింగ్ పూర్తయ్యింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధికారికంగా తెలియ‌జేసింది.

Nani - Shyam Singha Roy: నాని.. ‘శ్యామ్ సింగరాయ్’ షూటింగ్ పూర్తి

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ‘శ్యామ్ సింగరాయ్’ షూటింగ్ పూర్తయ్యింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధికారికంగా తెలియ‌జేసింది. గ‌త నెలాఖ‌రున ప్రారంభ‌మైన ఫైన‌ల్ షెడ్యూల్ ఈనెలాఖ‌రుతో పూర్తి చేశారు. ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా స్టెబాస్టియన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. సినిమా 1960-70 కాలం నేపథ్యంలో తెరకెక్కుతోంది.  నిహారిక ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయినపల్లి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దీని తర్వాత నాని ‘అంటే .. సుందరానికి’ చిత్రాన్ని స్టార్ట్ చేయబోతున్నాడు.  మరోవైపు ఇప్పటికే పూర్తయిన ‘టక్ జగదీష్’ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు నేచురల్ స్టార్.



Updated Date - 2021-07-26T16:14:54+05:30 IST