Nani : ఆస్కార్ బరిలో నేచురల్ స్టార్ చిత్రం

ABN , First Publish Date - 2022-08-17T21:51:47+05:30 IST

గతేడాది నేచురల్ స్టార్ నానీ (Nani) నటించిన పీరియాడికల్ ఫిక్షనల్ డ్రామా ‘శ్యామ్ సింగరాయ్’ (Shyam Singharoy). రాహుల్ సాంకృత్యాయన్ (Rahul Sankrithyayan) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నానీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.

Nani : ఆస్కార్ బరిలో నేచురల్ స్టార్ చిత్రం

గతేడాది నేచురల్ స్టార్ నానీ (Nani) నటించిన పీరియాడికల్ ఫిక్షనల్ డ్రామా ‘శ్యామ్ సింగరాయ్’ (Shyam Singharoy). రాహుల్ సాంకృత్యాయన్ (Rahul Sankrithyayan) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నానీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. పూర్వజన్మల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నానీ బెంగాలీ యువకుడిగానూ, ఒక ఫిల్మ్ మేకర్ గానూ రెండు పాత్రల్లో  అద్భుతంగా నటించి మెప్పించారు. కథానాయికగా సాయిపల్లవి (Saipallavi) అత్యుత్తమ నటనను కనబరిచింది. స్వాతంత్ర్యానికి పూర్వం బెంగాల్ లోని ఒక ప్రాంతంలో జరిగే అనాచారాలపై తిరుగుబాటు చేసే యువకుడిగా నానీ చాలా పవర్ ఫుల్ పాత్రను పోషించారు. కృతిశెట్టి (Krithi shetty) మరో కథానాయికగా నటించగా.. రాహుల్ రవీంద్రన్, మడోనా సెబాస్టియన్, మురళీ శర్మ, జిషు సేన్ గుప్తా, శుభలేఖ సుధాకర్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఓటీటీలో కూడా ఈ సినిమా విశేష ప్రజాదరణ పొందింది. 


అలాంటి ఈ సినిమా మూడు కేటగిరిస్‌లో ఆస్కార్ బరిలో నిలిచింది.‘శ్యామ్ సింగరాయ్’ చిత్రాన్ని పిరియాడిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, భారతీయ సాంప్రదాయ క్లాసిక్ విభాగాల జాబితాలో ఆస్కార్ పరిశీలనకు పంపినట్టు సమాచారం. ఈ విషయం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయింది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ (Niharika Entertainments) బ్యానర్ పై నిర్మాణం జరుపుకున్న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ విడుదలై. అక్కడ కూడా మంచి వసూళ్ళను రాబట్టింది. 


వాసుదేవ్ ఒక మంచి దర్శకుడు. ఒక మంచి షార్ట్ ఫిల్మ్ తీసి పేరు తెచ్చుకొని ఆ తర్వాత సినిమా దర్శకుడిగా పేరు తెచ్చుకోవాలనుకుంటాడు. ఆ క్రమంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల అతడ్ని పూర్వ జన్మ వెంటాడుతుంది. తను క్రిందటి జన్మలో ప్రముఖ బెంగాలి రచయిత శ్యామ్ సింగరాయ్ నని అర్ధమవుతుంది. ఇంతకీ ఎవరా శ్యామ్ సింగరాయ్ ? అతడి కథాకమామిషేంటి? అన్నదే మిగతా కథ. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా.. ఈ సినిమా కథాంశాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు రాహుల్ సాంకృత్యాయన్. ఈ సినిమా ఇప్పుడు ఆస్కార్ బరిలోకి దిగడం గొప్ప విషయం.

Updated Date - 2022-08-17T21:51:47+05:30 IST