సైనికుడి కథతో నాని?
ABN , First Publish Date - 2021-07-13T01:25:56+05:30 IST
నాని హీరోగా, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ వచ్చిన ‘జెర్సీ’ సూపర్‌హిట్ అయిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో మరో సినిమా రాబోతుందనే వార్త కొద్ది రోజులుగా ఫిల్మ్‌నగర్ సర్కిల్‌లో వినిపిస్తోంది.

నాని హీరోగా, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ వచ్చిన ‘జెర్సీ’ సూపర్‌హిట్ అయిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో మరో సినిమా రాబోతుందనే వార్త కొద్ది రోజులుగా ఫిల్మ్‌నగర్ సర్కిల్‌లో వినిపిస్తోంది. అయితే నాని నిజంగానే గౌతమ్‌తో ఓ సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిసింది. ఓ రియల్ హీరో జీవిత కథ ఆధారంగా బయోపిక్‌కు డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి సన్నాహాలు చేస్తున్నారనే వార్తలు చక్కర్లు కొడుతుంది. యుద్దంలో కాళ్లు కోల్పోయిన సైనికుడి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా ఉండబోతుందట. ప్యాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రూపొందించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. ఇప్పటికీ బ్యాక్ ఎండ్ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం నాని చేస్తున్న చిత్రాలు పూర్తయ్యాక ఈ బయోపిక్ పట్టాలెక్కనుందట.