సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) హీరోగా నటించబోతున్న లేటెస్ట్ మూవీలో నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) నటించబోతున్నాడా..అంటే ప్రస్తుతం అవుననే వార్తలు సోషల్ మీడియాలో వచ్చి వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. పరశురామ్ పెట్లా (Parasuram Petla) దర్శకత్వంలో కీర్తి సురేష్ (Keerthi Suresh) హీరోయిన్‌గా నటించింది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆ అంచనాలను అందుకుంది. అభిమానులు, మేకర్స్ ఆశించిన సక్సెస్‌ను సర్కారు వారి పాట దక్కించుకుంది.
ఈ మూవీ విషయంలో మహేశ్ పెట్టుకున్న నమ్మకాలన్ని నిజమయ్యాయి. అదే ఊపుతో నెక్స్ట్ సినిమాను కూడా సెట్స్ మీదకు తీసుకువచ్చేందుకు రెడీ అవుతున్నారు. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేష్ - మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటి నుంచే అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇందులో మహేశ్ మాంచి మాస్ హీరోగా కనిపించబోతున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి.
ఇదిలా ఉంటే, తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో న్యూస్ వచ్చి నెట్టింట చక్కర్లు కొడుతోంది. నేచురల్ స్టార్ నాని మహేష్ - త్రివిక్రమ్ మూవీలో కీలక పాత్రను పోషించనున్నట్టు సమాచారం. ఇంతకముందు మహేష్ - వెంకటేష్ కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా చేశారు. ఈ సినిమా అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొని భారీ హిట్ అందుకుంది. మళ్ళీ ఇన్నాళ్ళకు మరోసారి మల్టీస్టారర్ సినిమా చేస్తున్నారు. అయితే, ఇంకా దీనిపై మేకర్స్ నుంచి అఫీషియల్‌గా మాత్రం కన్‌ఫర్మేషన్ రాలేదు. మహేష్ - త్రివిక్రమ్ మూవీలో నాని నటించే విషయమై క్లారిటీ ఎప్పుడొస్తుందో చూడాలి. కాగా, ప్రస్తుతం అంటే.. సుందరానికి, దసరా చిత్రాలతో బిజీగా ఉన్నాడు నాని.