నానీ Dasara సినిమా దశ తిరిగిందా?

Twitter IconWatsapp IconFacebook Icon
నానీ Dasara సినిమా దశ తిరిగిందా?

నేచురల్ స్టార్ నానీ (Nani) ఇటీవల నటించిన ‘అంటే సుందరానికి’ (Ante Sundaraniki) చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. అయినప్పటికీ ఓటీటీలో ఈ సినిమాకి మంచి స్పందన దక్కింది. అయితే ఈ సినిమా ప్రభావం నానీ తదుపరి చిత్రం ‘దసరా’ (Dasara) పై ఏమాత్రం లేకపోవడం గమనార్హం. కొత్త దర్శకుడు ఓదెల శ్రీకాంత్ (Odela Srikanth) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నానీ ఇదివరకు ఎన్నడూ చూడని విధంగా పక్కామాస్ అవతార్‌లో అభిమానులకు ఫీస్ట్ ఇవ్వబోతున్నాడు. మల్లూ బ్యూటీ కీర్తి సురేశ్ (Keerthi Suresh) కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) నిర్మిస్తున్నారు. సింగరేణి బొగ్గుగనుల నేపథ్యంలో ఆసక్తికరమైన కథాకథనాలతో ఈ సినిమా రూపొందుతోంది. ఇంతకు ముందు ఈ సినిమా నుంచి విడుదలైన నానీ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 

ఇక దసరా చిత్రానికి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ హాట్ కేక్స్‌లా అమ్ముడు పోయాయట. ఓటీటీ,శాటిలైట్, ఆడియో రైట్స్ .. అన్నీ కలిపి దాదాపు రూ. 47 కోట్లు దక్కాయని సమాచారం. చిత్రానికి బడ్జెట్ రూ. 50 కోట్ల నుంచి 60 కోట్ల వరకూ అవనుంది. అంటే విడుదలకు ముందే ఈ సినిమా సేఫ్ జోన్‌లోకి వచ్చేసినట్టే. ఒక కొత్త దర్శకుడి సినిమాకి ఈ రేంజ్‌లో బిజినెస్ అవడం నానీ క్రేజ్‌కు నిదర్శనమని చెప్పాలి. నానీ కెరీర్ లో ఇది తొలి పాన్ ఇండియా చిత్రం అవడం విశేషం.

 

‘నేను లోకల్’ (Nenu Local) చిత్రం తర్వాత నానీ, కీర్తి సురేశ్ మరోసారి జోడీగా నటిస్తున్న నేపథ్యంలో చిత్రానికి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే... ఇందులో నానీ పూర్తి స్థాయిలో తెలంగాణ స్లాంగ్‌లో డైలాగ్స్ చెప్పబోతున్నాడు. నానీ రఫ్ అండ్ టఫ్ గెటప్‌కు ఆ స్లాంగ్ తోడైతే థియేటర్స్‌ ఈలలు, గోలతో మోతెక్కుతాయని వేరే చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించే నానీ.. ‘దసరా’ చిత్రంతో తన ఖాతాలో మరో సూపర్ హిట్ నమోదు చేస్తాడని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు.   

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.