మరో విజయానికి ‘నాంది’

ABN , First Publish Date - 2022-06-28T05:36:07+05:30 IST

‘నాంది’తో అల్లరి నరేశ్‌ కెరీర్‌లో ఓ మర్చిపోలేని విజయం చేరింది. ఈ చిత్రంతోనే విజయ్‌ కనకమేడల దర్శకుడిగా పరిచయం అయ్యారు...

మరో విజయానికి ‘నాంది’

‘నాంది’తో అల్లరి నరేశ్‌ కెరీర్‌లో ఓ మర్చిపోలేని విజయం చేరింది. ఈ చిత్రంతోనే విజయ్‌ కనకమేడల దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా శ్రీకారం చుట్టుకొంది. సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ థీమ్‌ పోస్టర్‌ని కూడా విడుదల చేశారు. రక్తపు మరకలతో నిండిన చేతులకు సంకెళ్లు వేస్తే.. ఆ నీడ గోడపై స్వేచ్ఛలా ఎగిరే ఓ పక్షిలా మారడం.. ఆసక్తిని కలిగిస్తోంది. ఇది ఓ సామాజిక అంశం చుట్టూ అల్లుకొన్న కథ అని పోస్టర్‌ చూస్తే అర్థమైపోతుంది. ప్రస్తుతం నరేశ్‌ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ చిత్రంలో నటిస్తున్నారు. అది పూర్తయిన వెంటనే ‘నాంది’ కాంబినేషన్‌ సెట్స్‌పైకి వెళ్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాల్ని త్వరలోనే ప్రకటిస్తారు. 


Updated Date - 2022-06-28T05:36:07+05:30 IST