‘నగుమోము తారలే..’ టీజర్‌తో ట్రీట్ ఇచ్చిన ‘రాధే శ్యామ్’

ABN , First Publish Date - 2021-11-30T02:29:23+05:30 IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాధే శ్యామ్’ సినిమాపై ఎటువంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే మంచి ఆకలిమీద ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదల అవుతుందా? అని. అందుకే ఈ చిత్ర నిర్మాతలపై

‘నగుమోము తారలే..’ టీజర్‌తో ట్రీట్ ఇచ్చిన ‘రాధే శ్యామ్’

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాధే శ్యామ్’ సినిమాపై ఎటువంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే మంచి ఆకలిమీద ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదల అవుతుందా? అని. అందుకే ఈ చిత్ర నిర్మాతలపై సోషల్ మీడియా ద్వారా దాడికి కూడా వెనుకాడటం లేదు. పాన్ ఇండియన్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం చిత్ర దర్శకనిర్మాతలు కూడా ఎంతగానో కష్టపడుతున్నారు. ఎలాగైనా ఈ చిత్రంతో ప్రభాస్‌కి పెద్ద సక్సెస్ ఇవ్వాలని దర్శకనిర్మాతలు ఏ విషయంలోనూ వెనుకాడటం లేదు. ఈ క్రమంలోనే ఇండియాలో మరే సినిమాకు సాధ్యంకాని స్థాయిలో ఒకే సినిమా కోసం రెండు డిఫరెంట్ మ్యూజిక్ టీమ్స్ వర్క్ చేస్తున్నాయి. ఇటు సౌత్ అటు నార్త్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా అత్యున్నత సంగీత దర్శకులతో పాటలు సిద్ధం చేయిస్తున్నారు రాధే శ్యామ్ టీం. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఆషికీ ఆ గయీ హిందీ సాంగ్ టీజర్ ట్రెండ్ అవుతుండగా.. తాజాగా తెలుగు సాంగ్ టీజర్‌ను కూడా చిత్రయూనిట్ విడుదల చేసింది. 


‘నగుమోము తారలే..’ అంటూ సాగే ఈ పాటను సిద్ శ్రీరామ్ పాడగా.. జస్టిన్ ప్రభాకరన్ బాణీలు సమకూర్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ టీజర్ వైరల్ అవుతోంది. ఈ పాట ఖచ్చితంగా అభిమానులకు నచ్చుతుందని నమ్మకంగా చెబుతున్నారు మేకర్స్. ఈ పాటలో ప్రభాస్, పూజా హెగ్డే ఇద్దరూ చాలా రొమాంటిక్‌గా కనిపిస్తున్నారు. సముద్రపు తీరంలో పాట చాలా రిచ్‌గా కనిపిస్తుంది. జస్టిన్ ప్రభాకరన్, అర్జిత్ సింగ్, మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్, జబిన్ నౌతీయల్, మనోజ్ ముంటాషిర్, కుమార్, రష్మీ విరాగ్ బృందం అంతా కలిసి సౌత్ నార్త్ వర్షన్స్ కు రాధే శ్యామ్ సినిమాకు అద్భుతమైన క్లాసిక్ సంగీతం అందిస్తున్నారు. ఇండియన్ సినిమా హిస్టరీలో ఒకేసారి ఒక సినిమాకు రెండు భాషల్లో వేర్వేరు సంగీత దర్శకులు పని చేయడం ఇదే తొలిసారి. ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ ప్రభాస్‌ని సరికొత్త లుక్‌లో ప్రెజెంట్ చేశారు. యువీ క్రియేష‌న్స్ బ్యానర్‌లో రూపొందుతోన్న ఈ చిత్రం జనవరి 14, 2022న విడుదల కానుంది.



Updated Date - 2021-11-30T02:29:23+05:30 IST