Naga sourya : నెక్స్ట్ మూవీ అనౌన్స్ అయింది

ABN , First Publish Date - 2021-09-26T16:08:20+05:30 IST

యంగ్ హీరో నాగశౌర్య ప్రస్తుతం సినిమాల లైనప్ ఓ రేంజ్ లో ఉంది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న మూడు, నాలుగు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి .. వాటిలో ఆర్చరీ బ్యాక్ డ్రాప్ లో సాగే .. ‘లక్ష్య’ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది.

Naga sourya : నెక్స్ట్ మూవీ అనౌన్స్ అయింది

యంగ్ హీరో నాగశౌర్య సినిమాల లైనప్ ఓ రేంజ్ లో ఉంది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న మూడు, నాలుగు  సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి .. వాటిలో ఆర్చరీ బ్యాక్ డ్రాప్ లో సాగే .. ‘లక్ష్య’ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. తర్వాత..  లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో రూపొందే ‘వరుడు కావలెను’ సినిమా అక్టోబర్ 15న విడుదల కాబోతోంది.  ‘పోలీసువారి హెచ్చరిక’ అనే థ్రిల్లర్ మూవీ కూడా షూటింగ్ కు రెడీ అవుతోంది. ఇంకా..  ‘నారీ నారీ నడుమ మురారి’ అనే సినిమాకి కూడా కమిట్ అయ్యారు.  ఇక శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ అనే మూవీ కూడా చిత్రీకరణ దశలో ఉంది.   ఇవి కాకుండా తాజాగా ఆయన మరో సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. శ్రీవెంకటేశ్వరా సినిమాస్ యల్.యల్.పీ, ఏసియన్ సినిమాస్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ నిర్మించనున్న ఈ మూవీ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కనుంది. 



ఇక ఈ సినిమాకి సంబంధించిన ఇతర కాస్టింగ్, దర్శకుడు ఎవరు అనే వివరాలు త్వరలోనే తెలుస్తాయి. నాగశౌర్య రీసెంట్ గా తన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ విషయాన్ని తెలియచేశారు. ‘నేను మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ను చేయబోతున్నా,ను. ఈ సినిమా చేయడానికి చాలా ఎక్సైట్ అవుతున్నాను. షూటింగ్ త్వరలోనే స్టార్ట్ అవుతుంది. మిగతా వివరాలు త్వరలోనే తెలుస్తాయి’.. అని నాగశౌర్య ట్వీట్ చేశారు. 



Updated Date - 2021-09-26T16:08:20+05:30 IST